Share News

రెండున్నరేళ్లలో 4,944 మందికి విదేశీ విద్యానిధి

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:37 AM

రెండున్నరేళ్లలో 4,944 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యానిధి కింద రూ.607.49 కోట్లు మంజూరు చేసినట్టు ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

రెండున్నరేళ్లలో 4,944 మందికి విదేశీ విద్యానిధి

  • 607.49 కోట్లు మంజూరు చేశాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రెండున్నరేళ్లలో 4,944 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యానిధి కింద రూ.607.49 కోట్లు మంజూరు చేసినట్టు ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మాజీ మంత్రి కేటీఆర్‌, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మజ్లిస్‌ ఎమ్మెల్యే మేరాజ్‌ హుస్సేన్‌లు అడిగిన ప్రశ్నలకు అడ్లూరి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 520 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ మంజూరు చేయాల్సి ఉందని, చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. అంతకు ముందు కేటీఆర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లకాలంలో 7వేల మందిని విదేశీ విద్యానిధి కింద విదేశాలకు పంపినట్టు తెలిపారు.

Updated Date - Mar 25 , 2026 | 04:37 AM