కడుపులో కత్తులతో సర్కారుపై హరీశ్, కేటీఆర్ విషం
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:00 AM
కడుపులో కత్తులు పెట్టుకుని కాంగ్రెస్ సర్కారుపై విషం కక్కుతున్న బీఆర్‌ఎస్ నేతలు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నలకు జవాబు చెప్పాలని...
కవిత ప్రశ్నలకు జవాబివ్వండి: మంత్రి అడ్లూరి
దేవరకొండ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కడుపులో కత్తులు పెట్టుకుని కాంగ్రెస్ సర్కారుపై విషం కక్కుతున్న బీఆర్‌ఎస్ నేతలు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నలకు జవాబు చెప్పాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ అప్పులపై తమ సర్కారు ఏటా రూ.6,000 కోట్లు వడ్డీ చెల్లిస్తోందని నల్లగొండ జిల్లా దేవరకొండలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో చెప్పారు. మరో పదేళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిపారు. ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల్లో నాలుగింటిని అమలు చేస్తున్నామన్న మంత్రి అడ్లూరి.. విడతల వారీగా మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.