అంగన్‌వాడీల కనీస వేతనాలు పెంచాలి
ABN , Publish Date - May 20 , 2026 | 11:13 PM
అంగన్వాడీలకు కనీ స వేతనం రూ.26 వేలకు ప్రతీ నెల ఒకటో తేదీన చెల్లించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీ నివాస్ డిమాండ్ చేశారు.
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్
నాగర్‌కర్నూల్ టౌన్, మే 20 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు కనీ స వేతనం రూ.26 వేలకు ప్రతీ నెల ఒకటో తేదీన చెల్లించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీ నివాస్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా ని ర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతిప త్రాన్ని ఎమ్మెల్యే కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి అందజేశారు. ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ అంగ న్‌వాడీలకు బీఎల్‌ఓ డ్యూటీలు రద్దు చేసి అద నపు పనిభారం మోపొద్దని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్స్ పోస్టులను భర్తీ చే యాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా నాయకులు రామ య్య, పర్వతాలు, మధు, కురుమయ్య, సుల్తాన్, అంగన్‌వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మీ, ప్రభావతి, నిర్మల, అలివేల, వెంక టమ్మ, యాదమ్మ, కృష్ణవేణి, నర్మద, భాగ్యలక్ష్మి, లక్ష్మి, పార్వతి, వరలక్ష్మి పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యదర్శికి వినతి
కొల్లాపూర్, (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ టీ చర్లు, హెల్పర్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివ వర్మ డిమాండ్ చేశారు. కొ ల్లాపూర్‌లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పీఏ గణేష్ రెడ్డికి అంగన్‌వాడీ యూ నియన్ నాయకులు కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్ర మంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ఉపా ధ్యక్షురాలు నీరజ, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పెబ్బేటి శంకర్, ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎండి సలీం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రామ కృష్ణ, కొల్లాపూర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు హుస్సే నమ్మ, నాయకురాళ్లు పుష్పలత, దేవమ్మ, శ్రీలక్ష్మి, పల్లవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.