Share News

కనీస వేతనం అమలు చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:19 PM

జిల్లా జనరల్‌ ఆసుప త్రిలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డుల తదితర కార్మికు ల కు కనీస వేతనం రూ.26 వే లు అమలు చేయాలని సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి ఆర్‌.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

కనీస వేతనం అమలు చేయాలి
జిల్లా ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌

- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, సె ప్టెంబరు 12 (ఆంధ్రజ్యో తి) : జిల్లా జనరల్‌ ఆసుప త్రిలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డుల తదితర కార్మికు ల కు కనీస వేతనం రూ.26 వే లు అమలు చేయాలని సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి ఆర్‌.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రి కార్మి కుల సమావేశం నిర్వహించారు. ఆర్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 60 ప్రకారం రూ.16,500 చెల్లించాల్సి ఉండగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ మినహాయింపుల పేరుతో కే వలం రూ.10,400 చెల్లిస్తోందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెంచాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని డి మాండ్‌ చేస్తూ దశల వారీగా పోరాటాలు చేప డతామని హెచ్చరించారు. అనంతరం కార్మికుల నూతన కమిటీ ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, కార్మికులు బాలకృష్ణమ్మ, బాలమణి, రాధ, రేణు క, కృష్ణమ్మ, మణేమ్మ, పుష్ప, శేషమ్మ, వెంకట మ్మ, మహేశ్వరి, కృష్ణవేణి, విజయలక్ష్మి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:19 PM