kumaram bheem asifabad-మినరల్ దోపిడీ
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:59 PM
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మినరల్‌వాటర్ పేరుతో శుద్ధి చేయని నీటిని క్యాన్లలో నింపి ప్రజలకు అంటగడుతున్నారు. ఇవి ఫిల్లర్ చేసిన వని భావించి ప్రజలు సైతం కొనుగోలు చేస్తున్నారు.
- పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా పట్టించుకోని అధికారులు
జైనూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మినరల్‌వాటర్ పేరుతో శుద్ధి చేయని నీటిని క్యాన్లలో నింపి ప్రజలకు అంటగడుతున్నారు. ఇవి ఫిల్లర్ చేసిన వని భావించి ప్రజలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఆ నీరు తాగితే పిల్లలు, పెద్దలకు మోకాళ్ల నోప్పులు, ఎముకల సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో నీటి డిమాండ్ గురించి ప్రత్యే కంగా చెప్పనక్కర లేదు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న వ్యాపారులు లాభాల వేటలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. నీటిని ప్యూరి ఫై చేసే పేరుతో దందా కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని చెబుతున్నారు.
- వాల్టా చట్టం ప్రకారం..
వాల్టా చట్టం ప్రకారం బోరు వేసేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అటు రెవెన్యూ నుంచి నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. వీటితో పాటు ఆహార భద్రత, కాలుష్య నియంత్రణ మండలి, గ్రామపంచాయతీ అనుమతి పొందాలి. కానీ ఏవేమి పట్టించుకో కుండానే వాటర్‌ప్లాంట్లను ఏర్పాటుచేసి శుద్ధ జలం పేరిట అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఒక్క నీటి ప్లాంటు ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. పలు కాలనీల్లో ఉన్న ఆర్వో ప్లాంట్ల యజమాన్యం ఫిల్టర్ చేయకుండానే నీటిని క్యాన్లలో నింపి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారనే వాదన లున్నా యి. 20లీటర్ల క్యాన్లతో పాటు కూలింగ్ క్యాన్లను సైతం పలు కేంద్రాల్లో శుభ్రపరచ కుండానే వినియోగించడం వల్ల నాచు పేరుకుపో తోంది. కొన్ని కేంద్రాల్లోనైతే అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. నిబంధనల ప్రకారం 180 రోజులు వినియోగించిన తర్వాత తిరిగి ఆ క్యాన్లను వాడ కూడదు. క్యాన్ల అడుగు భాగంలో నాచు పేరుకు పోతోంది. పట్టణ స్థాయిలో మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో రెవెన్యూ అదికా రులు అనుమతి, పరిశీలన, తనిఖీలు, పర్యవేక్షణ తదితర విషయాలు చూడాల్సి ఉన్న పట్టించుకోవడం లేదనే విమర్శలు న్నాయి. తనిఖీలు చేయాల్సిప ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు మామూలుగా విడిచి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.
- అనుమతులు లేకుండానే..
అనుమతులు లేకుండానే తాగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లవైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ప్రజలకు ఇష్టారాజ్యంగా నీటిని సరఫరా చేస్తూ ప్రజలప్రాణాలతో వ్యాపారులు చెలగా టం ఆడుతున్నారు. ప్లాంట్ల నిర్వాహకులు కోట్లాది రూపాయల దందాచేస్తూ నాణ్యత ప్రమాణాలు ఏమాత్ర పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, తిర్యాణి మండలాలే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో సైతం గల్లికో మినిరల్ వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. చిన్న షెడ్లు, ఇళ్లలోనే యంత్రాలు పెట్టుకోని నీటిని క్యాన్లలో నింపుతున్నారు. అవసరమైన ఫిల్టర్ మార్పులు, ల్యాబ్ పరీక్షలు శుధ్ధి ప్రక్రియలు పాటించకుండానే నీటిని విక్రయించడం వల్ల ప్రజలు తెలియకుండానే అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ మినిరల్ వాటర్ ప్లాంట్ తప్పనిసరిగా తరచుగా నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించుకోవాలి. ఫిల్టర్లు, మెంబ్రేన్లు, యువీ లైట్లు వంటి పరికరాలకు అనుగుణంగా మార్చాలి. కాని చాల ప్లాంట్లలో ఇవేమి పాటించడం లేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల నెలల తరబడి ఒకే ఫిల్టర్ వాడుతు న్నారని, నీటి నాణ్యత పూర్తిగా పడి పోయినా సరే క్యాన్లలో నీరు నింపి సరఫరా చేస్తున్నా రని స్థానికులు చెబుతున్నారు. మినరల్ పేరుతో కలుషిత నీటిని విక్రయిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.