Share News

కొత్త పాలకవర్గాలపై కోటి ఆశలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:22 PM

మునిసి పాలిటీల ఎన్నికల ప్రక్రియ ముగిసి, చైర్మన్లు, వార్డు స భ్యులు కూడా కొలువు దీరినందున ఇక బల్దియాలకు మహర్దశ పట్టనుందనే గంపెడాశతో పుర ప్రజలు ఉన్నా రు.

కొత్త పాలకవర్గాలపై కోటి ఆశలు

-’’ప్రత్యేక’’ పాలనలో మునిసిపాలిటీలు అస్తవ్యస్తం

-ప్రజలకు కరువైన జవాబుదారీ తనం

-సమస్యలు వినేవారు లేక ప్రజల అవస్థలు

-పురపాలికల్లో వేగం పుంజుకోనున్న అభివృద్ధి

మంచిర్యాల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మునిసి పాలిటీల ఎన్నికల ప్రక్రియ ముగిసి, చైర్మన్లు, వార్డు స భ్యులు కూడా కొలువు దీరినందున ఇక బల్దియాలకు మహర్దశ పట్టనుందనే గంపెడాశతో పుర ప్రజలు ఉన్నా రు. ఇంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో అస్తవ్యస్త మైన పురపాలికల స్థితిగతులు కొత్త పాలక వర్గాల ఎ న్నికతో తిరిగి గాడిన పడనున్నాయి. మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం గత ఏడాది జనవరి 26వ తేదీతో ముగిసింది. ఏడాది తరువాత ఎన్నికలకు మోక్షం లభించింది. పాలక వర్గాలు రద్దు కావడంతో ఏడాది కా లంగా మునిసిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో ప ని చేశాయి. పాలక వర్గాలు లేని కారణంగా సుదీర్ఘకా లం పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి. మునిసిపాలిటీల వారీగా జిల్లా వ్యాప్తంగా ప్ర త్యేక అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించినప్పటికీ, వారు రెగ్యులర్‌ విధుల్లో బిజీగా ఉండి, పట్టణాలపై పెద్ద గా దృష్టి సారించలేక పోయారు. దీంతో ఆలనా పాలన కరువై పుర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

కుంటుపడ్డ అభివృద్ధి..

ప్రత్యేకాధికారుల పాలనలో జిల్లాలోని మునిసిపా లి టీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. దాదాపు ఏడా దికాలం పాటు జవాబుదారీతనం లేక ప్రజలు నానా అ వస్థలు పడ్డారు. బల్దియాల్లో పారిశుధ్య పనులు, డ్రైనేజీ పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు, తదితర పనులు మాత్రం చేపట్టగలిగారు. అంతకు మించి కనీస అభివృ ద్ధికి నోచుకోలేదని ప్రజలు వాపోతున్నారు. మునిసిపా లిటీల పదవీకాలం ముగిసిన తరువాత అసెంబ్లీ, పార్ల మెంట్‌ ఎన్నికల నిర్వహణ, మొన్నటి పంచాయతీ ఎన్ని కలతోపాటు దైనందిన కార్యకలాపాల్లో అధికారులు బిజీ అయ్యారు. తమ రోజువారీ విధులు నిర్వహించేందుకే వారికి సమయం దొరకలేదు. పైగా మునిసిపాలిటీల బాధ్యతలు అధనంగా అప్పగించడంతో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. పురపాలికల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు సంబంధిత అధికారులతో ఏకరువు పెట్టినా ఫలితం లేకుండా పోయింది.

నిధుల కొరతతో ఇబ్బందులు...

ఓ వైపు పాలక వర్గాలు లేకపోవడం, మరోవైపు ప్ర భుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవ డంతో మునిసిపాలిటీల్లో సమస్యలు పరిష్కారానికి నో చుకోలేదు. అత్యవసర పనులు చేపట్టేందుకు కూడా సరిపడా నిధులు అందుబాటులో లేవు. దోమల నివార ణకు ఫాగింగ్‌ చేసేందుకు కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితులు నెలకొన్నాయి. మునిసిపాలిటీల పదవీకాలం మగిసిన ఏడాదిపాటు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంధ్రం నుంచి విడుదలయ్యే నిధులు కూడా రాకుండా పోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలం లో నిధులు విడుదల చేయకపోవడంతో ఎన్నికల బరిలో నిలిచే ఆశావహులు వార్డుల్లో పర్యటించలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా మునిసిపాలిటీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కోగా, ఎ క్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి.

కొత్త పాలకవర్గాలపైనే ఆశలు...

పురపాలికల్లో దాదాపు ఏడాది తరువాత కొత్త పాలక వర్గాలు ఏర్పాటు కావడంతో ప్రజలు వాటిపై కోటి ఆశ లు పెట్టుకున్నారు. ఇంతకాలం పట్టణాల్లో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైన అభివృద్ది ఇకమీదట గాడిన పడుతుందనే భావనలో ప్రజలు ఉ న్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగానే మొన్న ఎ న్నికైన చైర్మన్లు, కౌన్సిలర్లలో అనేక మంది యువత ఉం డటం కలిసి వచ్చే అంశం. కొత్త తరం ప్రజా పాలనలోకి రావడంతో పుర ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నా రు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు కూడా అభి వృద్ధికి బాటలు వేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపొందటం తమకు కలిసి వచ్చిన అవకా శంగా వారు భావిస్తున్నారు. కొత్త పాలక వర్గాలు ఏర్పా టైన మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు చెన్నూరు, బెల్లం పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో 70 శాతం మేర అధి కార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాలకవర్గ సభ్యులే ఉండటంతో సకాలంలో నిధులు విడుదలై వేగంగా అభి వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకా నంద, గడ్డం వినోద్‌ ముగ్గురు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారే కావడంతో వారి సహకారంతో సకాలంలో నిధులు విడుదల అవకాశం ఉంది.

కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు....

మంచిర్యాల పట్టణం మునిసిపాలిటీ నుంచి కార్పొ రేషన్‌గా మారినందున ప్రత్యేక నిధులు వచ్చే అవకాశా లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథ కాల కారణంగా మంచిర్యాల కార్పొరేషన్‌కు పెద్ద మొ త్తంలో నిధులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన అమృత్‌ స్కీం, స్మార్ట్‌ సిటీ పథకాల కింద మంచిర్యాల నగర పాలక సంస్థకు కోట్లాది రూపాయల నిధులు మంజూరుకానుండటంతో అభివృద్ధి జరుగనుంది. కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పెద్ద మొత్తం నిధులు కూడా అభివృద్ధికి దోహదం చేయను న్నాయి. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రత్యేక దృష్టి సారిం చనుండటం, కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌తోపాటు అత్యధిక సంఖ్యలో ఆ పార్టీ కార్పొరే టర్లే ఎన్నిక అయినందున ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Feb 24 , 2026 | 11:22 PM