Millions Flock to Medaram: కిటకిటలాడిన మేడారం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:12 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ..
8 లక్షలాదిగా భక్తజనం.. వనదేవతలకు ముందస్తు మొక్కులు
తాడ్వాయి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. వనదేవతల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. వాగొడ్డున ఉన్న జంపన్న, నాగులమ్మ దేవతల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క- సారలమ్మల నామస్మరణలతో గద్దెల వద్దకు చేరుకున్నారు. ఎత్తు బంగారం(బెల్లం) నెత్తిన మోస్తూ అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆదివారం 4 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.