Share News

kumaram bheem asifabad- మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

ABN , Publish Date - May 25 , 2026 | 10:15 PM

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా రైస్‌ మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలోని పాలనాధికారి చాంబర్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి రైస్‌ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా రైస్‌ మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలోని పాలనాధికారి చాంబర్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి రైస్‌ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుంచి మద్దతు ధఱ చెల్లించి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్‌ మిల్లులను పంపించడం జరుగుతుందని, ఈ క్రమంలో రైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం దిగుమతి వేగవంతంగా చేయాలని, జాప్యం ఉండకూ డదని తెలిపారు. హమాలీల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా రెవెన్యూ అధికారి వేణులతో కలిసి హాజరై ఆర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన నాగేష్‌ తాను కొనుగోలు చేసిన భూమిని భూ భారతి ఆన్‌లైన్‌ చేసి పాస్‌ పుస్తకాలలో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. సిర్పూర్‌(యూ) మండలం మహగాం గ్రామానికి చెందిన కొడప హీరామన్‌ తాను గ్రామీణ ఉపాధి హామీపథకంలో క్షేత్ర సహాయకుడిగా పని చేస్తుండగా విధుల నుంచి తొలగించారని తిరిగి ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. సిర్పూర్‌(యు) మండలం కోహినూర్‌ గ్రామానికి చెందిన మందాడి రంభ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. పెంచికలపేట మండలం చెడ్వాయి గ్రామానికి చెందిన రాజయ్య తాను తెలంగాణ ఉద్యమంలో పని చేసినందున తనకు ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడడు. రెబ్బెన మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన లింగయ్య తన భూ సమస్యను పరిస్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. కాగజ్‌నగర్‌ మండలం బోరిగాం గ్రామానికి చెందిన సాహస్తి తనకు దివ్యాంగ పెన్షన్‌ మంజూరు చేయాలని, ఆసిఫాబాద్‌ మండలం బ్రాహ్మణవాడకు చెందిన విజయ్‌ కుమార్‌ వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 10:15 PM