Share News

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:49 PM

నాగర్‌కర్నూల్‌ మీదుగా వె ళ్లే డోర్నకల్‌- గద్వాల నూ తన రైల్వేలైన్‌కు ఆమోదం లభించిన సందర్భంగా బీ జేపీ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశా రు.

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం
ప్రధాని మోదీ చిత్ర పాటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ మీదుగా వె ళ్లే డోర్నకల్‌- గద్వాల నూ తన రైల్వేలైన్‌కు ఆమోదం లభించిన సందర్భంగా బీ జేపీ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు మాట్లాడుతూ 296 కిలోమీటర్ల పొడవు రైల్వేలైన్‌కు సుమారు రూ.5500 కోట్లు ఖర్చవు తుందని పేర్కొన్నారు. ఫైల్‌ లోకేషన్‌ సర్వే పూర్తయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ప్రధానమం త్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా రైల్వే సాధన సమితి చైర్మన్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ డోర్నకల్‌- గద్వాల రైల్వే లైన్‌తో జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరనుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజుగుల నారేందర్‌గౌడ్‌, నాయకులు తిరుపతి రెడ్డి, నోమేష్‌రెడ్డి, చీర్ల సుదర్శన్‌, జగదీశ్వర్‌రెడ్డి లక్ష్మణ్‌గౌడ్‌, సత్యనారాయణ, మాకం చంద్రకళ, చిక్కొండ్ర చందు, పోల్దాసు రాము, రాజేశ్వర్‌ రెడ్డి, బుసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 11:49 PM