Share News

పత్తి కొనుగోళ్లలో దళారుల హవా..!

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:55 PM

పత్తి కొనుగోళ్లలో మధ్య దళారుల హవా కొనసాగుతోంది. ఆ రుగాలం శ్రమించి, కష్ట నష్టాలకోర్చి సాగు చేసిన పం టకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశా జనకంగా లేకపోవడంతో రైతన్నలు ప్రైవేటును ఆశ్ర యిస్తున్నారు.

పత్తి కొనుగోళ్లలో దళారుల హవా..!

-రైతులను మచ్చిక చేసుకునేందుకు ఆరాటం

-అడ్వాన్సులతో పంటను చేజిక్కుంటున్న వ్యాపారులు

ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లింపులు

పంట విక్రయం కోసం ప్రైవేట్‌ వైపే రైతుల మొగ్గు

మంచిర్యాల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లలో మధ్య దళారుల హవా కొనసాగుతోంది. ఆ రుగాలం శ్రమించి, కష్ట నష్టాలకోర్చి సాగు చేసిన పం టకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశా జనకంగా లేకపోవడంతో రైతన్నలు ప్రైవేటును ఆశ్ర యిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం లక్షా 72వేల పై చిలుకు ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 16 లక్షల 97వేల పైచిలుకు క్వింటాళ్లు దిగుబడి వస్తుం దని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్ప టికే పత్తి ఏరడం ప్రారంభం కాగా రైతులు ఒకటి రెం డు దఫాలుగా పంటను విక్రయించారు. ప్రైవేటు మా ర్కెట్లో పత్తి ధర జోరు మీదుండటంతో సీసీఐ తరు పున అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ లేదు. దీంతో ట్రేడ్‌ లైసెన్సులు గల వ్యాపారులు నేరు గా రైతుల వద్ద పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో మధ్య దళారులు రంగ ప్రవేశం చేసి, తమ పబ్బం గడుపుకోవడానికి పత్తి చేలకు వెళ్లి తమకే పం ట విక్రయించేలా రైతులను మశ్చిక చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పత్తి దిగుబడిపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం డియా) నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది ఎకరాకు 9.6 క్వింటాళ్ల దిగుబడి రావలసి ఉంది. వర్షాభావ పరి స్థితుల కారణంగా దానికి భిన్నంగా సగటున మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చినట్లు రైతులు చె బుతున్నారు. దీంతో లోటును భర్తీ చేసేందుకు రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రైవేటులో ధర భేష్‌...

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేటు మార్కెట్‌లో పత్తికి ఽఎక్కువ మొత్తంలో గిట్టుబాటవుతుండటంతో రైతులు తమ పంటను వ్యా పారులకు విక్రయిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్స రానికి గాను ప్రభుత్వం పత్తికి ప్రకటించిన కనీస మ ద్దతు ధర (ఎంఎస్‌పీ) 8 శాతం లోపు తేమతో కూడి న పొడుగు పింజ రకం క్వింటాలుకు రూ. 8667 ఉం డగా, మధ్య రకం పింజ రూ. 8267 ఉంది. గతేడాదితో పోల్చితే గరిష్టంగా రూ. 100 పైచిలుకు ధరలను పెం చారు. అదే ప్రైవేటు మార్కెట్‌లో రూ. 9000 నుంచి రూ. 9200 వరకు ధర పలుకుతోంది. క్వింటాలుపై స గటున రూ. 500 వరకు అధనంగా లభిస్తుండటంతో రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. పైగా పత్తి తూకం వేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తుండటం తో రైతులు ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. అ దే ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఆన్‌లైన్‌ విధానంలో కనీసం 15 రోజుల త రువాత రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. పైగా ప్రభుత్వ కేంద్రాలు దూర ప్రాంతాల్లో ఉండటం, రోజు ల తరబడి వాహనాలను క్యూలో ఉంచాల్సిన పరిస్థి తులు ఉండేవి. ప్రస్తుతం వ్యాపారులు పంట కోసం చేల వద్దకే వెళ్తుండటంతో విక్రయాలు సులభతరంగా మారాయి.

అడ్వాన్సులతో ముందస్తు బుకింగ్‌...

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతుల కు ఆశాజనకంగా ఉండకపోవడంతో వ్యాపారులు వారి ని మశ్చిక చేసుకుంటూ తమ పనులు కానిస్తున్నారు. పిందె దశకు వచ్చిన పంట యజమానికి దగ్గరకు ముందుగానే వెళ్తున్న వ్యాపారులు వారి అవసరాల రీత్యా డబ్బులను అడ్వాన్సు రూపంలో చెల్లింపులు చే స్తున్నారు. పంట సాగుకు అవసరమైన సాయం కోసం రైతులు వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితు లు ఉంటున్నాయి. దీంతో ముందుగానే రైతులతో అవ గాహన కుదుర్చుకుంటూ పంట ఏరగానే వ్యాపారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు అవసరాలు తీరడం, పంట చేతికొచ్చిన తక్షణమే డబ్బులు అంద డంతో రైతులు సైతం ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్ర యిస్తున్నారు.

ప్రైవేటులోనే విక్రయిస్తా...

లగిసెట్టి రాజమౌళి, హాజీపూర్‌ మండలం గుడిపేట

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేటు మార్కెట్‌లోనే లాభసాటిగా ఉండటంతో పత్తిని వ్యాపా రులకు విక్రయించే ఆలోచనతో ఉన్నాను. ఐదెకరాల్లో పత్తిసాగు చేయగా, ఈ ఏడాది దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రైవేటులో క్వింటాలుకు ఒక్కంటికి దాదాపు రూ. 500 అధికంగా ధర గిట్టుబాటు అవు తుండటంతోపాటు పంట విక్రయించిన వెంటనే వ్యా పారి డబ్బులు చెల్లిస్తుండటంతో ఎదురు చూపులు చూడాల్సిన అవసరం ఉండటంలేదు.

Updated Date - Nov 18 , 2026 | 11:55 PM