Share News

పర్యాటకం, లాజిస్టిక్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు!

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:16 AM

విద్యార్థులకు నాణ్యమైన ఆన్‌లైన్‌ విద్య, ఉపాధి నైపుణ్యాల శిక్షణ అందించేందుకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) త్వరలోనే కొత్త కోర్సులను ...

పర్యాటకం, లాజిస్టిక్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు!

  • త్వరలో ప్రారంభించనున్న మహాత్మా గాంధీ వర్సిటీ

  • ఆన్‌లైన్‌ విద్యావకాశాలకు టీ-శాట్‌తో ఎంవోయూ

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన ఆన్‌లైన్‌ విద్య, ఉపాధి నైపుణ్యాల శిక్షణ అందించేందుకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) త్వరలోనే కొత్త కోర్సులను ప్రశేపెట్టబోతోంది. ఎంజీయూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం, తెలంగాణ స్కిల్‌ అండ్‌ అకడమిక్‌ ట్రైనింగ్‌ (టీ-శాట్‌) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. ఈ ఒప్పం దం ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులను విస్తరించడంతో పాటు కొత్త సర్టిఫికెట్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. గురువారం ఎంజీయూ ఉపకులపతి ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, టీ-శాట్‌ సీఈవో బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక, భౌగోళిక పరిమితులతో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే టీ-శాట్‌ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వర్సిటీలతో భాగస్వామ్యాల ద్వారా మార్కెట్‌ అవసరాలకు అనుగుణమైన ప్రత్యేక సర్టిఫికెట్‌ ప్రోగ్రాములను రూపొందించి, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక నిర్వహణ, లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రత్యేక సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. లైవ్‌ లెక్చర్లు, రికార్డెడ్‌ క్లాసులు, అసైన్మెంట్లు, వర్క్‌షాప్‌లతో రూపొందించిన శిక్షణా మాడ్యూల్స్‌కు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. అల్తాఫ్‌ హుేస్సన్‌ మాట్లాడుతూ.. ఈ ఎంవోయూతో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గ్రామీణ, పరిమిత వనరులున్న ప్రాంతాల్లోని యువత కు ఈ ఆన్‌లైన్‌ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే కొనసాగుతున్న టూరిజం ఆన్‌లైన్‌ తరగతులను మరింత విస్తరించడంతో పాటు కొత్త సర్టిఫికెట్‌ కోర్సులనూ ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 03:16 AM