Share News

kumaram bheem asifabad- మేట్ల కొత్త లెక్క

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:22 PM

ఉపాధి హామీ పనుల్లో కూలీలను సమీకరించి, పని ప్రదే శంలో పర్యవేక్షించే మేట్‌లను ఇకపై కూలీల సంఖ్య కు అనుగుణంగానే కేటాయించాల్సి ఉంటుంది. ప్రతీ 20 మంది కూలీలకు ఒక మేట్‌ను, 40 మంది వరకు ఉంటే ఇద్దరిని, ఆపై కూలీల సంఖ్య పెరిగే కొద్ది అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలం గాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభిృద్ధిశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

kumaram bheem asifabad- మేట్ల కొత్త లెక్క
లోగో

- కూలీల సంఖ్య ఆధారంగా సిబ్బంది నియామకం

- 20 మందికి ఒకరు, 40 దాటితే ఇద్దరు

వాంకిడి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల్లో కూలీలను సమీకరించి, పని ప్రదే శంలో పర్యవేక్షించే మేట్‌లను ఇకపై కూలీల సంఖ్య కు అనుగుణంగానే కేటాయించాల్సి ఉంటుంది. ప్రతీ 20 మంది కూలీలకు ఒక మేట్‌ను, 40 మంది వరకు ఉంటే ఇద్దరిని, ఆపై కూలీల సంఖ్య పెరిగే కొద్ది అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలం గాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభిృద్ధిశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పరిధిలో వీబీజీ రామ్‌జీలో 335 గ్రామ పంచాయతీల్లో 1.22 లక్షలు జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 2.44 లక్షలు కూలీలు ఉన్నారు. వీరిలో 85 వేలు క్రీయశీల జాబ్‌కార్డులు 1.57 మంది యాక్టివ్‌ వర్కర్లు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 160 మంది ఫీల్డ్‌ అసి స్టెంట్లు ఉండగా 2152 మంది మేట్‌లు పనిచే స్తున్నారు. ఇందులో 2001 మంది పురుషులు, 18 మంది మహి ళలు ఉన్నారు. కొత్త నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా యాక్టివ్‌ కూలీల సంఖ్య ను బట్టి మేట్లను నియమించే అవకాశముంది.

- పెరిగిన బాధ్యతలు..

నూతన విధానంతో మేట్‌ బాధ్యతలు మరింత పెరిగాయి. కేవలం కూలీలకు పని చూపించడమే కాకుండా పనిస్థలంలో గుర్తులు చూపించడం, రోజు వారీ హాజరునమోదు చేయడం, ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ యాప్‌ లేదా భౌతిక మస్టర్‌ రోల్‌ ద్వారా డిజిటల్‌ హాజరు తీసుకోవడం వీరి ముఖ్య బాధ్యత. దాంతో పాటు రోజువారీ కొలతలు తీసుకోవడం, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ నిర్వహించడం, ప్రతి కూలీ చేసిన పని వివరాలు, పొందిన వేతనాన్ని ఉపాధి కార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో మేట్‌ ప్రభుత్వ రికార్డులకు, కూలీలకు మధ్య కీలక అనుసంధానకర్తగా మారనున్నారు.

- ప్రోగ్రామ్‌ అధికారి..

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నేట్‌ కనెక్షన్‌ ఉండి ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ హాజరు ఆప్‌లోడ్‌ చేసే సామర్థ్యం ఉన్న కూలీలనే మేట్లుగా గుర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రోగ్రామ్‌ అధికారి పరిశీ లించి ఆమోదించిన తర్వాత వారిని సాప్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. వీరికి ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ వినియో గంపై శిక్షణ ఇస్తారు. కఏంద్ర ఎస్‌వోపీ ప్రకారం పనిస్థలంలోనే జియోటాగింగ్‌, సమయ నమోదుతో పాటు ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా హాజరును డిజి టల్‌గా నమోదు చేయాల్సి ఉంటుంది. అంథెం టికేషన్‌ విఫలమైతే నిర్ధేశించిన మినహాయింపు విధానాన్ని అనుసరించి డిజిటల్‌గా నమోదు చేయా లి. కాగితపు మస్టర్‌ కంటే డిజిటల్‌ ఆధారాలతో నిర్ధారించే విధానం బలోపేతం కానుండి. మస్టర్‌ రోల్‌ ముగిసిన మూడు రోజుల్లోగా సాంకేతిక సిబ్బంది కొలతలు పూర్తి చేసి డిజిటల్‌గా నమోదు చేసిన తర్వాతే వేతనాల జాబితా రూపొందుతుంది. దీంతో కూలీ హాజరు ఒకవైపు, చేసిన పని పరిమా ణం మరోవైపు ఉండగా.. రెండింటినీ అనుసంఽ దానించే బాధ్యత మరింత కీలకంగా మారుతుంది.

- మహిళలకు ప్రాధాన్యం..

మేట్ల ఎంపికలో మహిళా కూలీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉపాధి పనుల్లో అనుభవం ఉన్న మహిళా కూలీలకు కొత్త బాధ్యతలు చేపట్టే అవసకాశం కల్పించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి పనులపై అవగాహన ఉన్న మహిళలకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త ఎస్‌వోపీ ప్రకారం వేతనం చెల్లిస్తారు. వీరికి ప్రత్యేక ఈ- మస్టర్‌ జారీ చేసి వేతనాన్ని నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు. మస్టర్‌ రోల్‌ ముగిసిన మూడు రోజుల్లోగా సాంకేతిక సిబ్బంది కొలతలు పూర్తి చేసి డిజిటల్‌గా నమోదు చేసిన తర్వాతే వేత నాల జాబితా రూపొందుతుంది.

Updated Date - Oct 08 , 2026 | 10:22 PM