607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి..
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:49 AM
రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుదారుల మెరిట్ జాబితాను బుధవారం మెడికల్....
దరఖాస్తుదారుల జాబితా విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుదారుల మెరిట్ జాబితాను బుధవారం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 26 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలని బోర్డు కోరింది. గతేడాది జూన్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు స్పందనగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3వేల పైగా దరఖాస్తులు వచ్చాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కులు, అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి బోర్డు ప్రాధాన్యం ఇచ్చింది. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది అర్హుల జాబితాను విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.