kumaram bheem asifabad- విలీనం సరే.. విద్యా ప్రమాణాలేవి?
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:06 PM
ఇంటర్మీడి యెట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాధనతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తీసుకరావాలన్న లక్ష్యం బాగానే ఉన్నా అందుకు అవ సరమైన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నాణ్యతపై మాత్రం ప్రశ్నలు తలెతు ్తతున్నాయి.
- డ్రాపౌట్ల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం
- జిల్లాలో 11జూనియర్ కళాశాలలు
- బోధన, పర్యవేక్షణ, మౌలిక వసతులపై తలెత్తుతున్న ప్రశ్నలు
బెజ్జూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడి యెట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాధనతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తీసుకరావాలన్న లక్ష్యం బాగానే ఉన్నా అందుకు అవ సరమైన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నాణ్యతపై మాత్రం ప్రశ్నలు తలెతు ్తతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే బోధన గాడి తప్పడం, అధ్యాపకుల పనితీరుపై పర్యవేక్షణ కొరవడడం వంటి అంశాలు విలీన నిర్ణయంపై చర్చకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2027-28విద్యా సంవత్సరం నుంచి 10+2విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పదో తరగతి తర్వాత వేరే కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాఠశాల స్థాయిలోనే ఇంటర్మీ డియెట్ విద్యను కొనసాగించడం ద్వారా డ్రాపౌట్లను తగ్గిం చాలన్నది ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా బాలికలు, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువుకు దూరం కాకుండా చూడా లని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ లక్ష్యం నెరవేరాలంటే ముందుగా బోధనా ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 11ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. వీటిలో గత విద్యా సంవత్సరంలో 82.16శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 66.68శాతానికే పరిమతమైంది. ఒకేషనల్ కోర్సు విభాగంలో ప్రథమ సంవత్సరంలో 69.50శాతం, ద్వితీయ సంవత్సరంలో 88.07శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి వరకు చదివి ప్రభుత్వ కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇంటర్మీడి యెట్‌లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోతు న్నారు. ఈ ఫలితాలు కేవలం విద్యార్థుల సామర్థ్యాన్నే కాకుండా కళాశాలల్లో బోధన తీరు, సిలబస్ పూర్తి, తరగతుల నిర్వహణ, పరీక్షలకు సన్నద్ధం చేసే విధా నం వంటి అంశాలపై సమీక్ష అవసరాన్ని సూచిస్తు న్నాయి. ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న కళాశా లలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబ డుతు న్నారు? అధ్యాపకుల కొరత ఉందా? తరగతులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా? అనే అంశా లపై విద్యాశాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత ఏడాది..
ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 2,150, వొకేషనల్‌లో 744 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంల జనరల్ 2,334, వొకేషనల్‌లో 498మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మకంతో చేరుతున్నా వారికి అందు తున్న విద్యాప్రమాణాలు కీలకంగా మారాయి. ప్రవే శాల సంఖ్య పెరగడం ఒక్కటే ప్రభుత్వ విద్య బలోపేతానికి కొలమానం కాదు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారా, సిలబస్ పూర్తవుతోందా, ప్రయోగశాలలు, లైబ్రరీలు అందుబా టులో ఉన్నాయా? పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారా అనేది అసలు ప్రశ్న.
- చదువు మానకుండా..
విద్యార్థులు చదువు మానేయకుండా చూడడం, ఒకే విద్యా వ్యవస్థలో 12వ తరగతి వరకు కొనసాగించడం స్వాగతించతగిన విషయమే అయినా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉతత్తీర్ణ శాతం మెరుగుపడక పోవడం, బోధన, పర్యవేక్షణపై విమర్శలు ఉండడం విలీన విధానం అమలుకు ముందున్న సవాళ్లని స్పష్టం చేస్తున్నాయి. జూనియర్ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదని సీఎం హామీ ఇచ్చారు. అయితే విద్యార్థుల విద్యా ప్రమాణాలు, కళాశాలల నిర్వహణ, పరీక్షల విధానం, అధ్యాపకుల బాధ్యతలపై కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితిని చక్కదిద్ది, బోధన నాణ్యతను పెంచిన ప్పుడే10+2విధానం ఆశించిన ఫలితాలు ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- పోటీ పరీక్షల సన్నద్ధతపై..
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఎంసెట్(ఈఏపీసెట్) జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు కీలకం. ప్రస్తుతం ప్రత్యేకంగా జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా కోర్సులకు అనుగుణంగా సబ్జెక్టుల బోధన, ప్రాక్టికల్స్, పోటీ పరీక్షల సన్నద్ధత అవసరం. 10+2విధానంలో పాఠశాలల పరిదిలోనే 11,12తరగతులు కొనసాగిస్తే ఈ అంశాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎంపీసీ, బైపీసీతో పాటు ఇతర గ్రూపుల ఎంపిక, సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకుల నియామకం, ప్రయోగ శాలల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్ట మైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది.