Share News

యోగాతో మానసిక ఉల్లాసం

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:22 PM

యోగా సాధన ద్వారా మానసికోల్లాసంతో పాటు శారీ రక ఆరోగ్యం మెరుగుపడుతుందని కల్వకుర్తి కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ముదిగొం డ రాజు అన్నారు.

యోగాతో మానసిక ఉల్లాసం
యోగాసనంలో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాజు

- కల్వకుర్తి సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ముదిగొండ రాజు

కల్వకుర్తి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : యోగా సాధన ద్వారా మానసికోల్లాసంతో పాటు శారీ రక ఆరోగ్యం మెరుగుపడుతుందని కల్వకుర్తి కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ముదిగొం డ రాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినో త్సవం సందర్భంగా శనివారం కల్వకుర్తి కోర్టు ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పలు యోగాసనాలు నిర్వహిం చారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.మ ల్లేష్‌, సీనియర్‌ న్యాయవాది సి.కృష్ణయ్య, సూప రింటెండెంట్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

యోగా ఆరోగ్యకర జీవనానికి మార్గం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి): యోగా ఆరోగ్యకర జీవనానికి మార్గదర్శనమని నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ క ళాశాల ప్రిన్సిపాల్‌ మదన్‌మోహన్‌ అ న్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేం ద్రంలోని కళాశాల ఆవరణలో విద్యార్థు లతో కలిసి ఆయన యోగాసనాలు వే శారు. కార్యక్రమంలో కళాశాలఎన్‌ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఉమాదేవి, అధ్యా పకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, రామకృష్ణ, కోదండ రాములు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

బిజినేపల్లి, (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ప్రతీ రోజు యోగా సాధన చేస్తే శారీరకంగా, మాన సికంగా ఉత్సాహంగా ఉండడమే కాకుండా, సం పూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారని ఏజీ బీఎస్సీ కళాశాల డీన్‌ డాక్టర్‌ హేమలత అన్నారు. మండలంలోని పాలెంలోని ప్రొఫెసర్‌ జయశంక ర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం విద్యార్థులకు యోగా ఆవశ్యకత, ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఒంగోలు శైల, యోగా గురువు శివప్ర సాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ శ్రీరమ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:22 PM