Share News

kumaram bheem asifabad- యోగాతో మానసిక ప్రశాంతత

ABN , Publish Date - Jun 21 , 2026 | 09:56 PM

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా అదికారులు, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు యోగా సాధకులతో కలిసి కలెక్టర్‌ యోగాసనాలు చేశారు.

kumaram bheem asifabad- యోగాతో మానసిక ప్రశాంతత
ఆసిఫాబాద్‌లో యోగా చేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా అదికారులు, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు యోగా సాధకులతో కలిసి కలెక్టర్‌ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయస్సు అనేది శరీరానికి సంబందించింది కాదని ఆది మనిషి యొక్క మనస్సుకు సంబందించినదని చెప్పారు.. ఏదైనా ఒక పనిని అసలు ప్రయత్నించకుండానే వదిలివేయడం ముసలితనానికి సంకేతమని, శారీరక ధృదత్వం లేకపోయిన కనీసం యోగా చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. యోగా వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు వివరించారు. అలాగే జిల్లా కోర్టు అవరణలో సీనియర్‌ సివిల్‌ జడ్జీ సంకేత్‌మిత్రా, సబ్‌జె ౖలులో సూపరింటెండెంట్‌, శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాగేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయా కార్యక్రమల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జీ అనంతలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, బార్‌ ఆసోసియోషన్‌ అధ్యక్షుడు సతీష్‌బాబు, డీడీ రమాుదేవి, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి మల్లిఖార్జున్‌, యోగా గురువు ఆశోక్‌ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహంచారు.. పట్టణంలో పలు చోట్ల ఈ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పటేల్‌ గార్డెన్‌లో భారత్‌ స్వాభిమాన్‌, పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో భారత్‌ స్వాభిమాన్‌, పతాంజలి యోగా సమితి సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లోని బాల భారతి కళాశాల గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగజ్‌నగర్‌ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో వాకర్స్‌ అసోషియేషన్‌ సభ్యులు, విద్యార్థినిలు యోగాసనాలు, ధ్యానము, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు రమేష్‌ మండల్‌, నిర్వాహకులు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో యోగా సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌ రావు, పరమేశ్వర్‌, మిట్టపల్లి సుదర్శన్‌, కౌన్సిలర్‌ మాణిక్యంలను సన్మానించారు, సభ్యులు పాల్గొన్నారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) మండలంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదాశవుడు మాట్లాడుతూ యోగాను నిత్యం చేయాలన్నారు. దీని పని ఒత్తిడి తగ్గి ప్రశాంత ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంరఽధజ్యోతి): మండల ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌ గణపతి మాట్లాడుతూ యోగా చేయటంతో ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగేష్‌, ఎన్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోఅంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక కస్తూర్బా పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయుడు నగేష్‌ మాట్లాడుతూ యోగాతో అన్నీ వ్యాధులకు నయం అవుతాయన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, సిబ్బంది, పీఈటీ స్వప్న, సీసీవో భాగ్యలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల, సన్‌ శైన్‌ పాఠశాల,బెర్‌ బాంబు సోసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యోగా సాధన చేశారు. వాంకిడి వైద్యశాలలో యోగా నిర్వహకుడు సెండే రవీందర్‌ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వినయ్‌ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బెర్‌ బాంబు సోసైటీ కేసీడీ సంపత్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం వెంకటేష్‌, సెసైటీ సభ్యులు సంతోష్‌, కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 09:56 PM