kumaram bheem asifabad- విద్యుత్ సమస్యలపై సభ్యుల ఆగ్రహం
ABN , Publish Date - Nov 16 , 2026 | 10:35 PM
గ్రామాల్లోని విద్యుత్ సమస్యలు, ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలు సరి చేయడం లేదని పలువురు సర్పంచ్‌లు విద్యుత్ అధికారులపై మండి పడ్డారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో సోమవారం ఎంపీడీవో నసిరుల్లాఖాన్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు ఎస్‌భారతి, ఇందిర శంకర్, స్రవంతి, ఇంద్రక్క మాట్లాడుతూ గ్రామాల్లోని ఇండ్ల మీద ఉన్న విద్యుత్ తీగలను సరి చేయడం లేదని విద్యుత్ శాఖ ఏఈ రవీందర్‌ను ప్రశ్నించారు. గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను గుర్తించి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఈ. రవీందర్ తెలిపారు.
దహెగాం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని విద్యుత్ సమస్యలు, ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలు సరి చేయడం లేదని పలువురు సర్పంచ్‌లు విద్యుత్ అధికారులపై మండి పడ్డారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో సోమవారం ఎంపీడీవో నసిరుల్లాఖాన్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు ఎస్‌భారతి, ఇందిర శంకర్, స్రవంతి, ఇంద్రక్క మాట్లాడుతూ గ్రామాల్లోని ఇండ్ల మీద ఉన్న విద్యుత్ తీగలను సరి చేయడం లేదని విద్యుత్ శాఖ ఏఈ రవీందర్‌ను ప్రశ్నించారు. గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను గుర్తించి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఈ. రవీందర్ తెలిపారు. వ్యవసాయ శాఖ సంబంధించిన వివరాలను ఏఈవో లావణ్య చదివి వినిపించారు. లగ్గాం సర్పంచ్ కొండ్ర మహేష్ గౌడ్ గ్రామాల్లో ఇప్పటికే పలు విత్తన వరి కంపెనీలు విత్తనాలు సరఫరా చేశాయని చెప్పారు. రైతులు నారుమల్లు సిద్ధం చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎన్ని గంటలు సరరఫరా చేస్తారని ప్రశ్నించారు. ఏఈ రవీందర్ విద్యుత్ సరఫరా వివరాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఏఈవో లావణ్య విత్తన కంపెనీలకు సూచించినప్పటికీ సరఫరా చేస్తున్నారని సమాధానం ఇచ్చారు. రాంపూర్ సర్పంచ్ రాజలింగు మాట్లాడుతూ వంట చెరుకు కోసం వెళ్లిన వారిని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పారు. అదే విధంగా గ్రామంలో ఇళ్లు కట్టుకున్న రహదారులు వేసినా అడ్డుకోవడం సరికాదని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ ఛైర్మన్ కె తిరుపతిగౌడ్, ఎంపీవో శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.