Share News

మీనాక్షి నటరాజన్‌పై ‘కేడీ’ బ్యాచ్‌ కుట్ర

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:18 AM

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మీనాక్షి నటరాజన్‌పై కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ (కేడీ) బ్యాచ్‌ కుట్రలు చేశాయని బీజేపీ అధికార ప్రతినిధి...

మీనాక్షి నటరాజన్‌పై ‘కేడీ’ బ్యాచ్‌ కుట్ర

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు

  • బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ ఆరోపణ

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మీనాక్షి నటరాజన్‌పై కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ (కేడీ) బ్యాచ్‌ కుట్రలు చేశాయని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభాష్‌ ఆరోపించారు. ‘సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీలో ఖమ్మం, నల్గొండ బ్యాచ్‌లు ఎలాగైతే పనిచేస్తున్నాయో, మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్‌కు వ్యతిరేకంగా కేడీ బ్యాచ్‌ పనిచేసింది’ అని చెప్పారు. ఆమె నామినేషన్‌ తిరస్కరణకు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుట్రలే కారణమని, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సంయుక్తంగా ఎజెండా సిద్ధం చేసుకుంటున్నాయన్నారు. రెండు పార్టీలు ఉమ్మడి శత్రువుగా బీజేపీని టార్గెట్‌ చేస్తూ ఒకే తాటిపై ఉండి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారసత్వ, నియంతృత్వ, కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ కుటుంబానికి, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ కాంగ్రెస్‌ పార్టీకి పోలికలు సరిపోతాయని సుభాష్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 14 , 2026 | 04:19 AM