‘మీ సేవ’కు అంతరాయం
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:44 AM
సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ ఆన్‌లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
3 నుంచి 5 వరకు సేవల నిలుపుదల
సర్వర్ నిర్వహణ పనుల కారణంగానే
హైదరాబాద్ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ ఆన్‌లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 3 సాయంత్రం 5గంటల నుంచి 5 ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్‌గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.