Share News

బస్తీ దవాఖానాతో అందుబాటులో వైద్యం

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:30 PM

బస్తీ దవాఖా నాల నిర్మాణం వల్ల ప్రజలకు వైద్యసేవలు మరింత అందు బాటులోకి వస్తాయని మునిసి పల్‌ వైస్‌ చైర్మన్‌ షానవాజ్‌ఖా న్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

బస్తీ దవాఖానాతో అందుబాటులో వైద్యం
బస్తీ దవాఖాన పనులను పరిశీలిస్తున్న మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌

- మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షానవాజ్‌ఖాన్‌

కల్వకుర్తి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : బస్తీ దవాఖా నాల నిర్మాణం వల్ల ప్రజలకు వైద్యసేవలు మరింత అందు బాటులోకి వస్తాయని మునిసి పల్‌ వైస్‌ చైర్మన్‌ షానవాజ్‌ఖా న్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని ఒకటవ వార్డులో బస్తీ దవాఖాన భవన నిర్మాణ పనులను పీఆర్‌ డ్యూటీ ఈఈ బసవలింగంతో కలిసి వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్య లు తీసుకుంటున్నారని తెలిపారు. కల్వకుర్తి ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు వంద పడకల ఆసు పత్రి దోహదపడ నుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ శ్రీరా ములు, పలువురు నాయకులు చిత్తారి శ్రీని వా సులు పాల్గొన్నారు.

బాధితుడి కుటుంబానికి పరామర్శ

కల్వర్తి పట్టణంలోని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన కనుక కృష్ణయ్య (మాజీ ఐఏఎస్‌) ఆది వారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట నాయ కులు చిత్తారి శ్రీనివాసులు, నేరటి చిన్న, కేశవు లు, శేఖర్‌, సత్యనారాయణ, వెంకటేశ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:30 PM