Share News

సింగరేణిలో మెడికల్‌ అన్‌ఫిట్‌ దందా...!

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:28 PM

సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహణలో భారీ కుంభకోణం వెలు గులోకి వచ్చింది. ఈ విషయమై రేవంత్‌ రెడ్డి సర్కారు ఏకంగా ఏసీబీ విచారణకు ఆదేశించడం కోల్‌బెల్ట్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ దందా జోరుగా సాగినట్లు భావి స్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయమై లోతుగా వి చారణ జరిపేందుకు సిద్ధపడటంతో అవినీతికి పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

సింగరేణిలో మెడికల్‌ అన్‌ఫిట్‌ దందా...!

-ఒక్కో కేసుకు రూ. 10 లక్షల వరకు వసూలు

-అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 14వేల మంది

-ఏసీబీ విచారణకు అనుమతించిన రేవంత్‌ సర్కారు

-గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు

మంచిర్యాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహణలో భారీ కుంభకోణం వెలు గులోకి వచ్చింది. ఈ విషయమై రేవంత్‌ రెడ్డి సర్కారు ఏకంగా ఏసీబీ విచారణకు ఆదేశించడం కోల్‌బెల్ట్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ దందా జోరుగా సాగినట్లు భావి స్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయమై లోతుగా వి చారణ జరిపేందుకు సిద్ధపడటంతో అవినీతికి పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సింగరేణిలో ప్రతి రెండు నెలలకోసారి మెడికల్‌ బోర్డు నిర్వహించ డం ద్వారా కార్మికుల ఆరోగ్య స్థితిగతులను సంస్థ పరీ క్షించేది. పరీక్షల్లో తీవ్రంగా అనారోగ్యం పాలై, విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న కార్మికులను అన్‌ఫిట్‌ చే యడం ద్వారా డ్యూటీలో నుంచి తొలగించేంది. సింగరే ణిలో అమలులో ఉన్న వారసత్వ ఉద్యోగాల కోటాలో అన్‌ఫిట్‌ అయిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు క ల్పించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న పలువురు మధ్య దళారులు కార్మికులకు ఎలాంటి అనారోగ్యం లేకపోయి నా....తమ పలుకుబడి ఉపయోగించి, మెడికల్‌ బో ర్డును తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా నకిలీ ధృవీ కరణ పత్రం పొందేవారు. అలా నిబంధనలకు విరు ద్దంగా అన్‌ఫిట్‌ అయిన కార్మికుల వారసులకు అక్ర మంగా ఉద్యోగాలు లభించేవి. ఇందు కోసం పైరవీదా రులు ఒక్కొక్క కార్మికుని నుంచి రూ. 5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం సమాచారం.

ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశం....

సింగరేణి మెడికల్‌ బోర్డులో నెలకొన్న అవినీతి, అక్ర మాలు ప్రభుత్వం ధృష్టికి రావడంతో దాన్ని సమూలం గా వెలికి తీసేందుకు ఏసీబీ అధికారులకు విచారణా ధికారం అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా 2014 నుంచి 2025 వరకు జరిగిన మెడికల్‌ బోర్డుపై పూర్తి విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. గత సంవత్సరం మె డికల్‌ బోర్డులో నెలకొన్న అవినీతి కారణంగా ఏసీబీ అ ధికారులు సంస్థ ప్రధాన కార్యాలయంలో పలువురి ఉ ద్యోగులపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహణ నిలిచిపోగా, ఈ విషయమై లోతుగా ధృష్టిసారించిన ప్రభుత్వం అసలు దోషులను పట్టుకొనే క్రమంలో ఏసీబీ విచారణకు ఆ దేశించింది. ఓ వైపు మెడికల్‌ బోర్డు నిర్వహించాలని కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టగా, మరోవైపు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడం తీవ్ర చర్చ నీయాంశం అవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరి గిన మెడికల్‌ బోర్డులో సింగరేణి వ్యాప్తంగా 14వేల పై చిలుకు కార్మికులు అక్రమ మార్గంలో విధుల నుంచి అన్‌ఫిట్‌ పొందగా, వారి స్థానంలో వారసులు ఉద్యోగా ల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రస్తుతం వారందరిపైనా విచారణ జరుగనుండటంతో తీవ్ర కలకలం రేపుతోంది.

బ్రోకర్ల చేతివాటం...

సింగరేణిలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే వారసులకు ఉద్యోగాలు లభిస్తుండటంతో కొందరు కార్మిక సంఘాల నాయకులతోపాటు బుడ్డ లీడర్లు కూడా బ్రోకర్లుగా అవతారం ఎత్తి అందినకాడికి దండుకున్నారన్న వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. మెడికల్‌ అన్‌ఫిట్‌ పొందేందుకు కార్మికుడికి రెండేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన ఉం డేది. దీంతో రెండేళ్లలో పదవీ విరమణ పొందే కార్మికు ల జాబితా సేకరించిన సదరు వ్యక్తులు వారితో బేరసా రాలకు దిగేవారు. తమకు ఎలాంటి అనారోగ్యం లేకపో యినా....తన వారసునికి ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో పలువురు కార్మికులు బ్రోకర్లను ఆశ్రయించినట్లు ఆరోప ణలు ఉన్నాయి. ఇదే అదునుగా ఒక్కో కేసుకు దాని స్థితిని బట్టి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు వసూలు చేసేవారు. అంతా సవ్యంగా జరిగి కార్మికుడు అన్‌ఫిట్‌ అయితే తామే చేయించామని....లేని పక్షంలో తీసుకు న్న మొత్తంలో కొంత భాగం అధికారుల చుట్టూ తిరి గేందుకు ఖర్చు అయిందని చెప్పుకుంటూ దళారులు ఎంతో కొంత చేతులో పెట్టి పబ్బం గడుపుకునేవారు. అలా సింగరేణి మెడికల్‌ బోర్డు పేరుతో కోట్లకు పడ గలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో నెలకొన్న ఈ చర్యల వల్ల మెడికల్‌ అన్‌ఫిట్‌కు అర్హత ఉన్న కార్మికులు సైతం దళారులను ఆశ్రయించక తప్ప ని పరిస్థితులు నెలకొన్నాయి. నేరుగా మెడికల్‌ బోర్డుకు వెళితే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానంతో విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించక తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయోమయంలో డిపెండెంట్లు....

సింగరేణిలో గత ఏడాది కాలంగా మెడికల్‌ బోర్డు నిర్వహణ నిలిచిపోవడంతో దానిపై ఆధారపడ్డ డిపెం డెంట్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. సింగ రేణి వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు మెడికల్‌ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేస్తే తాము అన్‌ఫిట్‌ అయి, తమ వారసుల కు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో అనారోగ్యం పాలైన కార్మికులు ఉన్నారు. ఏడాది కాలంగా మెడికల్‌ బోర్డు కార్యకలాపాలు స్తంభించి పోవడంతో డిపెండెంట్ల వయస్సు ప్రమాణాల (ఏజ్‌ లిమిట్‌)పై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది లా ఉండగా చాలా కాలం తరువాత సింగరేణిలో వార సత్వ ఉద్యోగం పొందిన కార్మిక కుటుంబాలను ప్రభు త్వం ఏసీబీ పేరుతో వేధించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:28 PM