వైద్య విద్యార్థులు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:51 AM
డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై యువతకు, విద్యార్థులకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించా లని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం వైద్య కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై యువతకు, విద్యార్థులకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించా లని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం వైద్య కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో డ్రగ్స్ నియంత్రణ, డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమా నికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై వైద్య విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ ద్వారా వివరిస్తూ ఆటపాటలతో అకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మా ట్లాడారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కలెక్టర్‌ను అధికారులు, వైద్యులు, వైద్య విద్యార్థులు సన్మానించారు.
ఫ గడువులోపు వైద్య కళాశాల
పనులు పూర్తి చేయాలి
గడువులోపు వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల భవన నిర్మాణ పను లను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆర్‌అండ్‌బీ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్ర మంలో ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఈఈ నరసింహ చారి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగా ర్జున చక్రవర్తి, జీజీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీన్ కుమార్, ఆర్‌ఎంఓ సంతోష్‌కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్‌కుమార్, వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.