Share News

kumaram bheem asifabad-వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:34 PM

వైద్య సిబ్బంది, వైద్యులు సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సూపర్‌వైజర్స్‌, పీహెచ్‌ఎన్‌, హెచ్‌వో, సీహెచ్‌వోలకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు తప్పకుండా 12 వారాల లోపు రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు. వారికి ఏఎన్‌సీ క్లినిక్‌ రోజు ల్యాబ్‌లో జరిగే అన్ని పరీక్షలతో పాటు సికిల్‌ సెల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. సాధారణ ప్రసవాలు చేయాలని సూచించారు. నవజాత శిశువులకు ఇచ్చే జీరో డోస్‌ నుంచి బూస్టర్‌ మోతాదు ఇవ్వాలని చెప్పారు. 5,10, 16 ఏళ్ల వరకు టీడీ ఇవ్వాలని, ఎస్‌సీడీ గురించి, స్త్రీలకు వచ్చే క్యాన్సర్‌ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు

kumaram bheem asifabad-వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సీతారాం

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది, వైద్యులు సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సూపర్‌వైజర్స్‌, పీహెచ్‌ఎన్‌, హెచ్‌వో, సీహెచ్‌వోలకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు తప్పకుండా 12 వారాల లోపు రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు. వారికి ఏఎన్‌సీ క్లినిక్‌ రోజు ల్యాబ్‌లో జరిగే అన్ని పరీక్షలతో పాటు సికిల్‌ సెల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. సాధారణ ప్రసవాలు చేయాలని సూచించారు. నవజాత శిశువులకు ఇచ్చే జీరో డోస్‌ నుంచి బూస్టర్‌ మోతాదు ఇవ్వాలని చెప్పారు. 5,10, 16 ఏళ్ల వరకు టీడీ ఇవ్వాలని, ఎస్‌సీడీ గురించి, స్త్రీలకు వచ్చే క్యాన్సర్‌ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, కుష్టు వ్యాధి నివారణ, వ్యాధి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స అందించే విషయంపై డీఎంహెచ్‌వో అవగాహన కల్పించారు. ముఖ్యంగా అయోడైజ్డ్‌ ఉప్పు వినియోగంపై వివరించారు. అయోడైజ్‌ లోపం ఉన్న స్త్రీలకు పిల్లలు కాకుండా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలకు బుద్ధిమాంధ్యం కలిగే అవకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. క్షయవ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సమావేశంలో డాక్టర్‌ వినోద్‌, ఎస్‌సీడీ డాక్టర్‌ వినయ్‌, సికిల్‌ సెల్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 11:34 PM