kumaram bheem asifabad- వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:26 PM
జిల్లాలో ఇంప్లాక్టు ఇండియా పౌండేషన్ ఆధ్వర్యంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అందించే వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు.
కాగజ్‌నగర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంప్లాక్టు ఇండియా పౌండేషన్ ఆధ్వర్యంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అందించే వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నామని చెప్పారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎక్కువ మంది ప్రజలకు తెలిసేట్టు విసృత ప్రచారం చేయాలన్నారు. ఈ శిబిరంలో కంటి, చెవి, అర్థోపెడదిక్, పెదవి చీలక, కాలిన గాయాలు, దంత చికిత్స, ప్లాస్టిక్ సర్జరీ వైద్య సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఫౌండేషన్ ట్రస్టు వారికి ప్రజలు సహకరించి వైద్య సేవలు పొందాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు మాట్లాడుతూ లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా ప్రాంతంలో 2వ సారి వైద్య సేవలు అందించటానికి ఇంపాక్టు ఇండియా పౌండేషన్ వారు ముందకు రావడం అభినందనీయమన్నారు. ఈ రైలు ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో 256 ప్రాజెక్టులను పూర్తి చేసినుట్ట తెలిపారు. 2022లో కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో సేవలు అందించారని చెప్పారు.. జిల్లా ప్రజలు ఈ సేవల్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేంద్ర, తహసీల్దార్ మధూకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పౌండేషన్ నిర్వహకులు డాక్టర్ రోహిణి, డాక్టర్ మనోమర్ రెడ్డి వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కేటాయించిన బార్ యాజమానులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కేంద్రంలో మంజూరైన బార్‌ను కలెక్టర్ కె హరిత, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో కలిసి మంజూరైన నూతన బార్‌ను లక్కీ డీప్ ద్వారా కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి నూతన బార్ అండ్ రెస్టారెంట్ మంజూరు కాగా ఈనెల 12వ తేఈ వరకు దరఖాస్తులను స్వీకరించామని చెప్పారు. బార్ ఏర్పాటుకోసం మొత్తం 207 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారి సమక్షంలో లక్కీ డీప్ పద్ధతిన 102 నంబరు గల మల్లుగారి రమేశ్‌గౌడ్‌కు లాటరీ ద్వారా బార్ దక్కిందన్నారు. బార్ నిర్వహణలో ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగుకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మనాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.