kumaram bheem asifabad- వైద్య సేవలు మెరుగుపడాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:52 PM
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రులలో వైద్యఆరోగ్య సేవలు మెరుగుపడాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో గురువారం వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్టా నెలలు నిండిన గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
ఆసిఫాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆసుపత్రులలో వైద్యఆరోగ్య సేవలు మెరుగుపడాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో గురువారం వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్టా నెలలు నిండిన గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఆసుపత్రుల్లో అవసర మైన పరికరాలు, మందుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులను ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య కళాశాలలో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. వైద్య విద్యార్థులకు బోధించడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియామకానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో మృత దేహలను తరలించడానికి పార్థివ వాహనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, డీఎంహెచ్‌వో సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్, అడిషనల్ డీఎంహెచ్‌వో నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.