Share News

మేడ్చల్ ఆశా కార్యకర్తల అరెస్ట్: బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:26 AM

డిమాండ్ల పరిష్కారానికి శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లిన బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్..

మేడ్చల్ ఆశా కార్యకర్తల అరెస్ట్: బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్

మేడ్చల్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల పరిష్కారానికి శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లిన బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్, ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి, పద్మలత, కృష్ణవేణి, రజిత, విమల, భాగ్యతార, రమణి, రజిత, నాగమ్మ, జయసుధ, లక్ష్మి, సుజాత, లక్ష్మి అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా అసెంబ్లీకి కొద్ది దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి, సైదాబాద్ పోలీస్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల మోసం చేసిందన్నారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఆ తర్వాత అమలు చేయడం లేదన్నారు. ఉద్యమాలను పోలీసులతో అణిచివేయాలని చూస్తే సహించబోమని, మరింత దూకుడుగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Untitled-1 copy.jpg

Updated Date - Sep 12 , 2026 | 12:39 AM