Share News

జంపన్నవాగు.. వ్యర్థాల కంపు!

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:19 AM

జంపన్నవాగు పరిసరాల్లో వ్యరా ్థలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాగులో భక్తులు వదిలేని దుస్తులు, గట్టుమీద పసుపు, కుంకుమ కవర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్‌ కవర్లతో ఆ పరిసరాలు దుర్గంధంగా మారాయి.

జంపన్నవాగు.. వ్యర్థాల కంపు!

మేడారం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జంపన్నవాగు పరిసరాల్లో వ్యరా ్థలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాగులో భక్తులు వదిలేని దుస్తులు, గట్టుమీద పసుపు, కుంకుమ కవర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్‌ కవర్లతో ఆ పరిసరాలు దుర్గంధంగా మారాయి. కొబ్బరి చిప్పలు కాళ్లకు గుచ్చుకుంటుండటంతో అక్కడి సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను అక్కడి నుంచి తరలించాల్సిన విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్నానం చేశాక దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడంతో మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated Date - Jan 30 , 2026 | 04:19 AM