Share News

మద్య నిషేధమా.. తూచ్‌!

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:31 AM

మన గ్రామంలో మద్యం ఉండకూడదు’’ అని తీర్మానించుకున్న ఆ గ్రామ పెద్దలు ఐదు రోజుల్లోనే మాట, మనసు మార్చేశారు. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసమంటూ ...

మద్య నిషేధమా.. తూచ్‌!

  • నిషేధం అనుకున్న రోజుల వ్యవధిలోనే

  • మద్యం అమ్మకాలకు వేలం మెదక్‌ జిల్లా నస్కల్‌లో ఘటన

రామాయంపేట/నిజాంపేట జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘మన గ్రామంలో మద్యం ఉండకూడదు’’ అని తీర్మానించుకున్న ఆ గ్రామ పెద్దలు ఐదు రోజుల్లోనే మాట, మనసు మార్చేశారు. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసమంటూ తమ గ్రామంలో మద్యం అమ్మకానికి ఒకరికి అనధికార లైసెన్స్‌ను విక్రయించేశారు. మెదక్‌ జిల్లా రామాయంపేట ఉమ్మడి మండలం నస్కల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. నస్కల్‌లో మద్యం ఉండకూదని ఈ నెల మొదటి వారంలోనే ఆ గ్రామ ప్రజలంతా కలిసి మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ తీర్మానం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారని అనుకునే లోపే.. గ్రామాభివృద్ధి కావాల్సిన నిధుల కోసమంటూ జూన్‌ 9న మద్యం అమ్మకాల హక్కు కోసం వేలంపాట పెట్టారు. ఈ వేలంలో పలువురు పోటీపడగా ఓ వ్యక్తి రూ.8.32 లక్షలకు ఏడాది కాలానికి మద్యం అమ్మకాల హక్కును దక్కించుకున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 04:31 AM