kumaram bheem asifabad-దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:14 PM
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట భవన సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, జిల్లా సంక్షేమ శాఖాధికారి భాస్కర్‌తో కలిసి జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశానికి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట భవన సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, జిల్లా సంక్షేమ శాఖాధికారి భాస్కర్‌తో కలిసి జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియమాలు 2018 ప్రకారంజిల్లాలో అమలు అవుతున్న పథకాలు, దివ్యాంగులకు సంబంధించిన విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల చిత్రాలపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలలో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, డీఎస్‌పీ వహిదుద్దీన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర జోషి తదితరులు పాల్గొన్నారు.
చైనా మాంజాతో పక్షులకు ప్రమాదం
ఆసిఫాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): చైనా మాంజా వినియోగం వల్ల పక్షులు, ఇతర జీవులకు ప్రమాదం కలుగులుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం అటవీ జిల్లా అదికారి నీరజ్‌కుమార్, అదనపు కలెక్టర్ డేవిడ్, అటవీ అదికారులు అప్పయ్యతో కలిసి చైనా మాంజాతో కలిగే అనర్థాలపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా మాంజాతో కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. చైనా మాంజాను పూర్తిగా నిషేధించాలని, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయలను మాత్రమే వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.