Share News

kumaram bheem asifabad- భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Nov 03 , 2026 | 10:33 PM

జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామవని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సుకు సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

kumaram bheem asifabad- భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
దహెగాంలో ఫిర్యాదును పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

దహెగాం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామవని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సుకు సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అధికారులు పరిశీలించి క్షేత్ర స్థాయిలో సమాచారంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ప్రజా సేతు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాప్‌లో ఇంటి వద్ద నుంచి క్యూఆర్‌ కోడ్‌ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ రోజు అర్ధరాత్రి అయిన సబ్‌ కలెక్టర్‌ తహసీల్దార్‌, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కారం చేసిన తర్వాతనే వెళ్లారని తెలిపారు. సమస్యల పరిష్కారంపై రైతులకు వివరించాలన్నారు. నిరాశ పట్టా పరిష్కారం కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఏమైన సమస్యలున్నట్లయితే ప్రజా సేవ యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. మండలంలోని హత్ని గ్రామానికి చెందిన పెద్దల బానక్క తన భూ సమస్య పరిష్కారానికి మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోవడాానికి డబ్బులు లేక పోవడంతో ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకొని కలెక్టర్‌ వెంటనే రూ.1,500 అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులుకలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రెబ్బెన, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): విధుల పట్ల అంకిత భావంతో పని చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని మండల పరిషత్‌ పాఠశాలను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయుల వ్యవహార శైలిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయులను వివిధ సమస్యలతో అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్‌ విద్యపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కంప్యూటర్‌ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాలలో భోజనాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 10:33 PM