Share News

పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:15 PM

కార్పొరేషన్‌లో అన్ని వీధుల్లో పారిశు ధ్య సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టి పిచ్చి మొక్కలు, డ్రైనేజీల్లో చె త్త చెదారం తొలగించి శుభ్రం చేయిస్తున్నామని మేయర్‌ ధర్ని మధుకర్‌ తె లిపారు.

పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు

మేయర్‌ దర్ని మధుకర్‌

నస్పూర్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌లో అన్ని వీధుల్లో పారిశు ధ్య సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టి పిచ్చి మొక్కలు, డ్రైనేజీల్లో చె త్త చెదారం తొలగించి శుభ్రం చేయిస్తున్నామని మేయర్‌ ధర్ని మధుకర్‌ తె లిపారు. 9వ డివిజన్‌ సీతారాంపల్లిలో మంగళవారం నిర్వహించిన శుభ్రత- ప్రతీ ఒక్కరి ఆర్యోగ భద్రత స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం మేయర్‌తో పాటు కా ర్పొరేటర్లు పర్యవేక్షించారు. సీతారాంపల్లి మురుగు కాలువ పూడిక తీత, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేయించారు. వీధుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేయాల్సిన పనులను సిబ్బందికి సూచించి త్వరగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ అన్ని డివి జన్లలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుర్మిళ్ల సౌమ్య-వేణు, మాజీ సర్పంచు తేలేటి కిష్ట య్య, నాయకులు మహేష్‌, డివిజన్‌లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:15 PM