Share News

kumaram bheem asifabad- రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:48 PM

జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, రవాణా, రహదారి, భవనాల, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, జాతీఅయ రహదారులు, విద్యా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు.

kumaram bheem asifabad- రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, రవాణా, రహదారి, భవనాల, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, జాతీఅయ రహదారులు, విద్యా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రహదారులు ప్రమాదాలు జపరగకుండా అసవరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నజ గ్రామాలలో నేషనల్‌ హైవే అధికారులు, లైటింగ్‌ ఏర్పాట్లు, సర్వీస్‌ రహదారి బ్రేకర్లు, సైడ్‌ డ్రైన్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పెట్రోలింగ్‌ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌ శాఖాధికారులు రహదారులకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, వేలాడే తీగలు సరి చేయాలన్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్‌ స్తంభాలకు రేడియం అంటించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ దత్తారావు, రవాణా శాఖాధికారి రాంచందర్‌, డీపీఓ భిక్షపతి, ఎస్‌ఈ ఉత్తంజాడే, పీఆర్‌ఈఈ ధర్మేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఒత్తిడి దూరం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): యోగా సాధనతో శారీరక, ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కలెక్టరేట్‌ సముదాయ కార్యాలయంలో శుక్రవారం యోగ ఫర్‌ వన్‌ ఎర్త్‌- వన్‌ హెల్‌ నినాదంతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా ఒక సమగ్ర పరిష్కారమని అన్నారు. యోగా కేవలం వ్యాయమ పద్దతి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానమని, దీన్ని ప్రతి రోజు ఆచరించడం ద్వారా శరీరానికి దృడత్వం, మనసుకు ప్రశాంతత లభిస్తాయన్నారు. రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నారు. ఈఆ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌, డీఆర్‌డీఓ దత్తారావు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 10:48 PM