Share News

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ABN , Publish Date - May 30 , 2026 | 12:21 AM

తడిసిన ధాన్యం సేకరణలో రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్గర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సేకరించిన ధాన్యం, తూకం

 రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌లో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

తంగళ్లపల్లి, మే 29 (ఆంఽధ్రజ్యోతి): తడిసిన ధాన్యం సేకరణలో రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్గర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సేకరించిన ధాన్యం, తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లడుతూ వరి దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు రాక పెరిగిందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 33వేల 758 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 80శాతం వరిధన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. డిఆర్డీవో, సహకార శాఖ, మోప్మా, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖల సమన్వయంతో కొనుగోలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు ధాన్యం, గోదాముల్లో ఽధాన్యం ఆన్‌ లోడింగ్‌ వేగంగా పూర్తి చేయాలని అధిరారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. తడిసని ధాన్యాన్ని కాంటా వేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాడానికి వాహనాలను సమకూర్చాలని ట్రాస్స్‌పోర్టు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫ రాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ పాల్గొన్నారు.

పొగాకు వాడకాన్ని నివారించేందుకు చర్యలు

Updated Date - May 30 , 2026 | 12:21 AM