Share News

kumaram bheem asifabad- నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 10:54 PM

మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీవో రవీందర్‌తో మాట్లాడి గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పారు.

kumaram bheem asifabad- నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

జైనూర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీవో రవీందర్‌తో మాట్లాడి గ్రామాల్లో నీటి ఎద్దడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాంటి గ్రామాల్లో బోరు బావులు మంజురు చేస్తామన్నారు. అత్యవస రమైన గ్రామాల్లో బోరు బావులు వేసేందుకు తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడక్కడా మిషన్‌ భగీరథ పైపులు లీకేజీ అవుతున్నాయని చెప్పారు. వాటి ద్వారా నీరు వృథా అవుతుందన్నారు. మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అనంతరం మార్కెట్‌ గోదాంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర ఉండేల చూడాలని, ప్రైవేట్‌ మార్కెట్లో శనగ విక్రయించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్‌ కమిటీ గోదాంలో శనగ క్వింటాలుకు రు. 5,875 ధర ఉందని చెప్పారు. బయట మార్కెట్లో అతి తక్కువ ధరలకు శనగలు అమ్ముకంటూ రైతులు మోస పోకూడదని సూచించారు. ఈ సందర్భంగా వారం రోజుల క్రితం కందులు ఎన్ని క్వింటాలు ఖరీదు చేశారని సీఈవో సోనకాంబ్లే జనార్దన్‌ను అడిగారు. వెయ్యి క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. అయితే రైతులకు నష్టం కల్గకుండా చూడాలని ఎమ్మెలే కోరారు. ఈ సందర్భంగా పవర్‌గూడలో జంగుబాయి, భీందేవుళ్ల వద్ద షెడ్లు మంజూరు చేయాలని కాలేజీగూడాలో తాగునీటి సమస్యలను పరిష్కరిం చాలని పవర్‌గూడ సర్పంచ్‌ రాజేందర్‌, మాజీ ఉప సర్పంచ్‌ ఆత్రం లక్ష్మణ్‌లు ఎమ్మెలేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, ఎంపీవో శశికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, మాజీ సహకార చైర్మన్‌ కొడప హన్ను పటేల్‌, మాజీ ఎంపీటీసీ కుంర భగ్వంత్‌రావ్‌, జామ్ని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ డొంగ్రే ప్రకాష్‌, సయ్యద్‌ మూసా, సుముక్‌వార్‌ నర్సింగ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌ లాల, ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్‌, ముండె సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అఽధికారులు గ్రామల్లో ఎప్పటికప్పుడు పర్యటించి తాగునీటి సమస్యను గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యదవ్‌రావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం ఓంప్రకాష్‌, సర్పంచులు మెస్రం స్పందనభూపతి, పెందొర్‌ మాధవ్‌రావు, నాయకులు ఆత్రం జాలంషా, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి 54 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో రామచందర్‌, లింగాపూర్‌ సర్పంచ్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కవిత, సర్పంచ్‌ బాపు, నాయకులు అజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 10:54 PM