Share News

kumaram bheem asifabad- సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:21 PM

గ్రామ పంచాయతీలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ స్టేట్‌ మోడల్‌ అధికారి శ్రీధర్‌తో కలిసి ఎంపీడీవో, పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, సర్పంచ్‌లకు గ్రామ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

kumaram bheem asifabad- సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, స్వచ్ఛభారత్‌ మిషన్‌ స్టేట్‌ మోడల్‌ అధికారి శ్రీధర్‌తో కలిసి ఎంపీడీవో, పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, సర్పంచ్‌లకు గ్రామ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌లు తమ గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో పగటి పూట వీధి దీపాలు వెలగకుండా నియంత్రికలు బిగించి విద్యుత్‌ ఆదా చేయాలని, గ్రామాలలో ఎక్కడ పడితే అక్క ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు పడవేయకూడదని, భారీ వర్షాల సమయంలో మురికి కాలువలలో చేరి మురుగు నీటి ప్రవాహానికి అడ్డుపడి మురుగు నీరు నివాసాలలో చేరుతుందని తెలిపారు. ప్రతి రోజు మురుగు కాలువలు శుభ్రం చేయాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. తద్వారా వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నియంత్రించవచ్చని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, నీరు నిలువ ఉండే చోట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. పాఠశాలలో మూత్రశాలలు, అదనపు గదుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సెలవు దినాలలో నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేసిగ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ కళాశాల, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో పఠన సామర్థ్యాన్ని పెంపొందించాలని చెప్పారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని చెప్పారు. సబ్జెక్టులలోని పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగేలా వినూత్న పద్ధతులలో బోధించాలని తెలిపారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న బోజనాన్ని ఉపాధ్యాయులు మొదట రుచి చూడాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇంట్లో చేసిన మాదిరిగానే భోజనం ఉండేలా చూడాలని చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో రుచికరమైన ఆహారం అందించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్లు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 10:21 PM