ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:53 PM
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో
ధర్మపురి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ధర్మపురి మండలంలోని రాయపట్నం బ్రిడ్జి పైనుంచి గోదావరి నది వరద ప్రవాహాన్ని శుక్రవారం ఆయన పరిశీలిం చారు. వరద పరిస్థితులపై సంబంధిత అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. గోదావరి నదీ తీర ప్రాంత గ్రామాలపపై ప్రత్యేక దృష్టి సారించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన తెలిపారు. అవసరమైతే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్దంగా ఉంచాలని ఆయన సూచించారు. వరద పరిస్థితులపై నిరం తరం నిఘా ఉంచి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు అవరమైన సహాయ చర్యలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి నదిలోకి మత్స్యకారులు వెళ్లకుండా, వరద ప్రవాహాన్ని దగ్గరగా వీక్షించేందుకు నదీ తీరాలకు చేరుకోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో జగిత్యాల ఆర్‌డీవో మదుసూధన్, ధర్మపురి మండల తహసీల్దార్ ఏరుకొండ శ్రీనివాస్, ఎంపీడీవో రవీందర్,డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలి
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అధికారులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురి మండ లంలోని నర్సయ్యపల్లె-కోరండ్లపల్లె, గ్రామాల మధ్య తెగిపోయిన కల్వర్టులు, నాగారం-ఆకుసాయిపల్లె గ్రామాల మధ్య రోడ్డు డ్యామ్ తెగిపోవడంతో వాటిని శుక్రవారం పరిశీలించారు. దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్ డ్యామ్ ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయాలని, తక్షణమే మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు.