kumaram bheem asifabad- తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:04 PM
జిల్లాలో ప్రతీ గ్రామానికి తాగునీరు అదే విధంగా మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశం మందిరంలో గురువారం తాగునీటి సరఫరా, పశుగ్రాసంపై ఎంపీడీలు, తహసీల్దార్లు, మిషన్ భగీరథ, ఇంజనీరింగ్, నీటి పారు దల శాఖ, పశు సంవర్థక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఆసిఫాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతీ గ్రామానికి తాగునీరు అదే విధంగా మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశం మందిరంలో గురువారం తాగునీటి సరఫరా, పశుగ్రాసంపై ఎంపీడీలు, తహసీల్దార్లు, మిషన్ భగీరథ, ఇంజనీరింగ్, నీటి పారు దల శాఖ, పశు సంవర్థక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ నీటి మట్టం తగ్గి పోవడంతో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 15 నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. చేతి పంపులు, సింగిల్ ఫేజ్‌మీటర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్ మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటిని వృధా చేయరాదన్నారు. తాగునీటిని వృధా చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. బోర్ వెల్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులను సిద్ధం చేయాలన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యామ్నాయ వనరులను గుర్తించాలని చెప్పారు. నీటి సమస్యపై సందేహాల కోసం టోల్‌ఫ్రీ నంబరు1916 సంప్రదించవచ్చన్నారు. వీబీజీరామ్‌జీ పథకం కింద చెరవులు, కాల్వల్లో పూడిక తీయించాలన్నారు. పశుగ్రాసంకు ఇబ్బందులు రాకుండా గ్రాసు పెంచుటకు అవసరమైన ప్రదేశాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. తాగునీటి సరఫరా పశుగ్రాసం పెంచటంపై ప్రతి మండలంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించాలన్నారు. అధికారులు సమన్యవంతో పని చేయాలన్నారు. వాటర్ ప్లాట్లు యాజమానులతో సమావేశం నిర్వహించి వృధా నీరుపై వివరించాలన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఆర్‌డీవో దత్తారావు, మిషన్ భగీరథ ఈఈ రాకేష్; సిద్దిక్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నీటి పారుదల శాఖ, పశు సంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు పారదర్శక సేవలు
ఆసిఫాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా ఆర్థిక సేవలను పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నామని కలెక్టర్ కె.హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రభత్వు ఉద్యోగులకు ఏర్పాటు చేసిన రెండ్రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, జిల్లా ఖాజాన శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఆవిష్కరించిన ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాంక్షన్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సేవలు సులభంగా పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఉద్యోగుల సర్వీసు వివరాలు, క్రమబద్ధీకరణ ఇక్రిమెంట్లు, భవిష్యనిధి, అర్జిత సెలవులు వంటి సేవలను ఉద్యోగుల వ్యక్తిగత లాగిన్ నుంచి తీసుకోవచ్చన్నారు. కాగిత రహిత సేవలు లేకుండా పూర్తిగా పోర్టల్ ద్వారా నిర్వహించవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఖాజానాశాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రతీ నెల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు:
ఆసిఫాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హైస్కూల్, కళాశాలల విద్యార్థులకు ఎలకో్ట్రరల్, లిటరసి క్లబ్ ఆధ్వర్యంలో శుద్ధమైన ఓటర్ల జాబితా ప్రాముఖ్యత అనే అంశంపై ప్రతీ నెల వ్యాసరచన , క్విజ్ పోటీలు నిర్వహించచాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ప్రతీ నెల ఎలకో్ట్రరల్ క్లబ్ ఆధ్వర్యంలో శుద్ధమైన ఓటర్లు జాబితా యొక్క ప్రాముఖ్య, ఓటు అంశంపై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గం స్థాయిలో పది మందిని ఎంపిక చేయాలన్నారు. అలాగే జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన పది మందిని ఎంపిక చేసి సర్టిఫికెట్లు అందజేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.