వంద శాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:22 PM
గర్భిణీలు, చిన్న పిల్లలకు వంద శాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
జైపూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : గర్భిణీలు, చిన్న పిల్లలకు వంద శాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, రిజిష్టర్‌లు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో వంద శాతం గర్భిణీల నమోదు చేపట్టాలన్నారు. అన్ని రకాల వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాలు సమయ పాలన పాటించాలని సూచించారు. వాతావరణంలో మార్పుల వల్ల జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది ముందస్తు చర్యలుచేపట్టాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలలు, పాఠశాలలను సందర్శించి పిల్లలకు పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. అలాగే రోజువారీగా ఈ ఔషది, టెలిమానస్ కార్యక్రమాలు , మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో పాము కాటు, కుక్క కాటు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెచ్‌ఈవో రాంబాబు, వైద్యులు రవి, భారతి, జయమ్మ, నాగమణి, సాధిక్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.