Share News

మాదక ద్రవ్యాల నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Aug 27 , 2026 | 10:46 PM

జిల్లాలో మాదక ద్ర వ్యాల నియంత్రణ దిశగా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మాదక ద్ర వ్యాల నియంత్రణ దిశగా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత జిల్లా సాధనలో బాగంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 49 కేసులు నమోదు అయ్యాయని, ఇందులో 103 మందిని గుర్తించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగదారులను గుర్తించి కోర్టు ద్వారా 30 మందిని డ్రగ్‌ డీ ఆడిక్షన్‌ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్‌ ఇప్పించామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గంజాయి తదితర మొక్కలు సాగు చేసే వారిని గుర్తించాలన్నారు. అలాగే జిల్లాలోని మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, బెల్టుషాపులను నియంత్రించాలని తెలిపారు. విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో బెల్టు షాపులు నిర్వహించడం, పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషేధించడం జరిగిందని, ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చ ర్యలను పటిష్టంగా అమలు పర్చాలని, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా వేగ నిరోధక బోర్డులు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ భాస్కర్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటి కలెక్టర్‌ విలాయత్‌ అలీ, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 10:46 PM