Share News

kumaram bheem asifabad-వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 10:58 PM

వయోవృద్థుల సంక్షేమం, హక్కుల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వయో వృద్ధులులు బావి తరాలకు ఒక దిక్సూచీలాంటి వారని చెప్రాపు. వారు ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు నేటి తరం పాటించాలని సూచించారు.

kumaram bheem asifabad-వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వయోవృద్థుల సంక్షేమం, హక్కుల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వయో వృద్ధులులు బావి తరాలకు ఒక దిక్సూచీలాంటి వారని చెప్రాపు. వారు ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు నేటి తరం పాటించాలని సూచించారు. వృద్ధులను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. వారి అనుభావాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధురాలు మహిళా సంఘాలలో సభ్యులుగా చేరితే ఎంతో భరోసా కలుగుతుందని చెప్పారు. వ్యక్తిగత సమస్యలు గ్రూపు సభ్యులతో చర్చించే అవకాశం ఉంటుందని వివరించారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా మహిళా సమైఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కుమరం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

కెరమెరి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జోడెఘాట్‌లో ఈ నెల 26న నిర్వహించే కుమరం భీం వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు పకడ్బంఈ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. స్థానికంగా శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 26న నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిరిజనులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం తాగునీరు, విద్యుత్‌, పారిశుద్యం, వైద్య సేవలు, రవాణా పార్కింగ్‌, భధ్రత ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్యనిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని అవసరమైన సంఖ్య తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరందం, భీం మనుమడు సోనేరావు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 10:58 PM