Share News

kumaram bheem asifabad- పేద గిరిజనుల అభ్యున్నతికి చర్యలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:38 PM

పేద గిరిజనుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున ్నామని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని చోర్‌పల్లిలో తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల కార్యక్రమంలో భాగంగా భాగస్వాముల కుటుంబాలకు ఉత్పాదకత, యూనిట్ల పంపిణీ, ప్రధానమంత్రి కృషి సించాయి యువజనలో స్వయం సహాయక సంఘాల అనుసంధానంతో ఊటకుంటలలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు.

kumaram bheem asifabad- పేద గిరిజనుల అభ్యున్నతికి చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులు

లింగాపూర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పేద గిరిజనుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున ్నామని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని చోర్‌పల్లిలో తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల కార్యక్రమంలో భాగంగా భాగస్వాముల కుటుంబాలకు ఉత్పాదకత, యూనిట్ల పంపిణీ, ప్రధానమంత్రి కృషి సించాయి యువజనలో స్వయం సహాయక సంఘాల అనుసంధానంతో ఊటకుంటలలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల కార్యక్రమంలో భాగంగా లింగాపూర్‌, తిర్యాణి మండలాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనందిస్తున్నామని చెప్పారు. పింఛన్ల పంపిణీ, గేదెలు, మేకలను పెంచడం ద్వారా జీవనోపాధి కల్పించేలా చర్యల తీసుకుంటున్నామని చెప్పారు. పిండిగిర్నీలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక కమిషనర్‌ శ్రీలక్ష్మి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఆర్‌డీఏ పీడీ దత్తారాం, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌రావు, ఎంపీడీవో రామ్‌చందర్‌, తహసీల్దార్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:38 PM