Share News

మహిళలు, విద్యార్థుల భద్రతకు చర్యలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:10 AM

మహిళలు, విద్యార్థుల భద్రత కోసం షీటీమ్‌లు నిరంతరం చర్యలు చేపడుతాయని విద్యార్థులు, మహిళలు సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదులు చేయాలని ఎస్పీ మహేష్‌బీగీతే కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన

మహిళలు, విద్యార్థుల భద్రతకు చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ మహేష్‌బీగీతే

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 6 (ఆంఽధ్ర జ్యోతి) : మహిళలు, విద్యార్థుల భద్రత కోసం షీటీమ్‌లు నిరంతరం చర్యలు చేపడుతాయని విద్యార్థులు, మహిళలు సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదులు చేయాలని ఎస్పీ మహేష్‌బీగీతే కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థలల్లో ర్యాగింగ్‌, ఇవ్‌ టీజింగ్‌, పోక్సోయాక్టు, లైంగిక వేధింపులపై అవగహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చిలో షీ టీమ్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో మూడు కేసులు నమోదు చేయడంతో పాటు నాలుగు పీటీ కేసులను నమోదు చేసి మహిళలను, విద్యార్థినిలను వేధిస్తున్న వారిని గుర్తించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని అన్నారు.

ముఖ్యంగా సామాజిక మాద్య మాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లో గానీ వేధింపులతో పాటు ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురైతే మహిళలు, విద్యార్థినిలు, బాలికలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతాయులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. షీ టీమ్‌ ఫోన్‌ నంబర్‌ 8721656425కు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:10 AM