Share News

kumaram bheem asifabad-గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు చర్యలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:33 PM

గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమారిటన్స్‌ ఫర్‌ ది నేషన్‌ సంస్థ సహకారంతో పునరుద్ధరించిన జిల్లాలోని కాగజ్‌నగర్‌ లైన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మారేపల్లిలో ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరితో కలిసి గురువారం ప్రారంభించారు.

kumaram bheem asifabad-గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు చర్యలు
లైన్‌గూడ పాఠశాలను పునఃప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరిత

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమారిటన్స్‌ ఫర్‌ ది నేషన్‌ సంస్థ సహకారంతో పునరుద్ధరించిన జిల్లాలోని కాగజ్‌నగర్‌ లైన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మారేపల్లిలో ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా, మండల పరిపాలనతో పాటు లైన్‌గూడ గ్రామ పంచాయతీ చేసిన అభ్యర్థన మేరకు సమారిటన్స్‌ ఫర్‌ ది నేషన్‌ సంస్థ సుమారు రూ.2.20లక్షల రూపాయిల సహాయంతో పాఠశాల పునరుద్ధ్దరణ పనులకు సహకారం అందించటం జరిగిందని తెలిపారు. ఈ పునరుద్ధరణ ద్వారా పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన, సౌకర్యవంతమైన అభ్యసన వాతావరణం కల్పించామని తెలిపారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్ధులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో స్వచ్చంద సం్థలు, ప్రజలు భాగస్వాములు కావడంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో సమారిటన్స్‌ ఫర్‌ ది నేషన్‌ వ్యవస్థాపకుడు పి.రాంకుమార్‌, ఎంపీడీవో ఉజ్వల్‌ కుమార్‌, ఎంఈవో వాసాల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే చర్యలు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని పౌరసరఫరాలశాఖ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌, విద్యాశాఖ, ఆర్‌ఆండ్‌బీ, ఖజనా, గిరిజన సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, అడిట్‌శాఖ, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను గురువారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. కొన్నికార్యాలయాల్లో అనుమతి లేకుండా సిబ్బంది గైర్హాజరు, మరికొన్ని కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై మండిపడ్డారు. సిబ్బందికి షోకాజు నోటిసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలనని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోస్టర్లు విడుదల

వయో వృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను గురువారం కలెక్టర్‌ హరిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమైన వయోవృద్ధుల వారోత్సవాలు అక్టోబరు 1 వరకు నిర్వహించనున్నామని చెప్పారు. అక్టోబరు 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కర్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 10:33 PM