kumaram bheem asifabad-గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:08 PM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ అన్నారు. జైనూర్ మండల పరిధిలో గల మార్లవాయిలో ఆదివారం నిర్వహించిన మానవ పరిణామ శాస్తవేత్త హైమన్ డార్ఫ్ దంపతులు వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు.
జైనూర్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ అన్నారు. జైనూర్ మండల పరిధిలో గల మార్లవాయిలో ఆదివారం నిర్వహించిన మానవ పరిణామ శాస్తవేత్త హైమన్ డార్ఫ్ దంపతులు వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. ఫ్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఆదివాసీల ఉన్నతి కోసం అనేక ప్రమాణిక గ్రంథాలను రాసి వారి జీవితాన్ని గిరిజనుల సేవలకే అంకితం చేశారని కొనియాడారు. నేటి తరం యువతీయువకులు చదువుపై దృష్టి సారించాలన్నారు. తద్వార అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్య పడుతుందని అన్నారు. ఆదివాసీల ఉన్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ మార్లవాయి అభివృద్ధికి రూ.91 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. నిధులు విడుదల చేసిన త్వరాత గతిన అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఆ దిశలో అధికారం యంత్రాంగన్ని అప్రమత్తం చేశామన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి ఆవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ గిరిజనులకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తున్నాయన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృఽతిద్ధికి పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సగుణ మాట్లాడుతూ కమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు మరిన్ని నిధులు మంజురు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కోరామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కుడిమెత విశ్వనాథ్‌రావ్, మంగమ్మ, తహసీల్దార్ ఆడ బీర్షావ్, సీఐ రమేశ్, ఎస్సై రవి కుమార్, డార్ఫ్ యువజన సంఘం సభ్యులు ధర్మెందర్, మధురాజ్, మాజీ ఎంపీపీ లక్ష్మణ్, సినీయర్ నాయకులు మేస్రాం అంబాజీ, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
సమాధులకు పూజలు..
హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి సందర్భంగా వారి సమాఽధుల వద్ద గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. తమ ఆరాధ్యులుగా భావించే డార్ఫ్ దంపతులకు పూల మాలలు, దీపారాధన, కొబ్బరి కాయలు సమర్పించారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ నితికా పంత్, ఐటీడీఎ పీవో యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సగుణక్క, ఆసిఫాబాద్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అజ్మీర శ్యాంనాయక్, తదితరులు సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. డార్ఫ్ దంపతుల వర్దంతి సందర్భంగా మండల కేంద్రంలోని కేరళ గ్రామర్, లిటిల్ స్టార్ పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.