Share News

షెడ్యూల్డు కులాల, తెగల అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:37 PM

జిల్లాలో షెడ్యూల్డు కులముల, తెగల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

షెడ్యూల్డు కులాల, తెగల అభివృద్ధికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో షెడ్యూల్డు కులముల, తెగల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్‌ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలో నెలకొన్న ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ పరిధిలోని అట్రాసిటీ కే సులు కార్యచరణ ప్రకారంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులో వివరాలు సక్రమంగా ఉంటే సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, షెడ్యూల్డు కు లాలు, తెగల వసతి గృహాలకు మూత్రశాలలు, నీటి సరఫరా, ప్రహరీ గోడ వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, అదనపు కలెక్టర్‌ రాములు, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, రెవెన్యూ అధికారి మోతిరాం, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏసీపీ లు ప్రకాష్‌, కిరణ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, షెడ్యూల్డు కులముల అభివృద్ధి అధికారి దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత మెరుగు పరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. సోమవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లోని మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, భోజనం హాజరు తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్‌ తరుచూ పాశాలలు, కళాశాలలను సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా అధికారులతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:37 PM