kumaram bheem asifabad- గురుకుల పాఠశాల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:18 PM
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల గిరిజన పిల్లల భవిష్యత్తు బంగారు మయంగా మార్చే విద్యాలయమని తెలిపారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల గిరిజన పిల్లల భవిష్యత్తు బంగారు మయంగా మార్చే విద్యాలయమని తెలిపారు. విద్యార్థులు గ్రామీణ; మారుమూల ప్రాంతల నుంచి ఎక్కువ ఉన్నారని, స్టేల్ సిలబస్ నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు మారే క్రమంలో విద్యార్థులు కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులకు మాతృభాషా నుంచి ఆంగ్ల మాద్యమానికి సులభంగా మారేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. నిరంతరంగా హాజరు పర్యవేక్షించా లన్నారు. విద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, విద్యాలయ ప్రిన్సిపల్, అధ్యాపకులు, సభ్యుఉల పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రయోగాలను ఆమె పరిశీలించారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఎంపీడీవోలు, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి రెండో విడత జాబితాపై జూం సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొదటి విడతలో 8,851 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. ఇంకా 1,100 ఇళ్ల్ల పనులు ప్రారంభం కాలేదన్నారు. ఇందుకు గల కారణాలు నివేదిక రూపంలో సమర్పించాలని కోరారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనులలో పురోగతి సాధించాల న్నారు. రెండో విడతలో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా చుడాలని చెప్పారు. గుడిసెలలో నివశించే వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పెర్కొన్నారు. ప్రతి సోమవా రం నిర్వహించే ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అనేక దరఖాస్తులు వస్తున్నాయని వివరించారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల పేర్లను గ్రామసభ నిర్వహించి తీర్మాణాలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, హౌసింగ్ పీడీ ప్రకాష్‌రావు, మేనేజర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
అవగాహన కలిగించాలి..
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ ఎయిడ్స్ వ్యాదులపై జిల్లా ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో నాగేంద్రతో కలిసి ప్రచార పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో లైంగిక సంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.