kumaram bheem asifabad- మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 10:40 PM
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్ డివిజన్‌లో గురువారం ఆయన పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నాణ్యత, సేవల పరంగా మరింత మెరుగు పర్చాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. దహెగాం నుంచి బెల్లంపల్లి డివిజన్‌లోని కన్నెపల్లి మధ్యలోని 20 కిలోమీటర్ల ఇంటర్‌లింకింగ్ లైన్ పనులను పరిశీలించారు. అలాగే పలు అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు
కాగజ్‌నగర్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్ డివిజన్‌లో గురువారం ఆయన పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నాణ్యత, సేవల పరంగా మరింత మెరుగు పర్చాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. దహెగాం నుంచి బెల్లంపల్లి డివిజన్‌లోని కన్నెపల్లి మధ్యలోని 20 కిలోమీటర్ల ఇంటర్‌లింకింగ్ లైన్ పనులను పరిశీలించారు. అలాగే పలు అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ సినాగరాజు, డీఈ టెక్నికల్ సుధాకర్ ఈఈ సివిల్ శ్రీనివాస్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి)/కౌటాల, (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి), కౌటాల మండలాల్లో ఉన్న సబ్ స్టేషన్లను విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి వరుణ్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సమసమస్యలపై అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరంతర సరఫరాకు కృషి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చే సమస్యలపై తక్షణమే స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ నాగరాజు, సుధాకర్, ఇర్ఫాన్ అహ్మద్, జగన్ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.