Share News

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:17 PM

మెనూ ప్రకారం విద్యార్థులకు నా ణ్యమైన భోజనం వడ్డించాలని సహా య గిరిజన అభివృద్ధి అధికారి నాగరా జు అన్నారు.

మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి
ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన సహాయ గిరిజన అభివృద్ధి అధికారి నాగరాజు

- ఏటీడీవో నాగరాజు

అచ్చంపేటటౌన్‌,జూలై29 (ఆంధ్రజ్యో తి) : మెనూ ప్రకారం విద్యార్థులకు నా ణ్యమైన భోజనం వడ్డించాలని సహా య గిరిజన అభివృద్ధి అధికారి నాగరా జు అన్నారు. బుధవారం మండల పరి ధిలోని ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థు లకు అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ వసతి గృహంలోని పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలన్నారు. కిచెన్‌ రూంతో పా టు వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ మల్లయ్యకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 11:17 PM