మెనూ ప్రకారం భోజనం అందించాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:58 PM
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. వంటగది, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు.
జిల్లా ఎస్సీ వెల్పేర్ డీడీ దుర్గాప్రసాద్
నెన్నెల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. వంటగది, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పిల్లలతో మెనూ అమలు గూర్చి అడిగి తెలసుకున్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మెనూ ప్రకారం భోజనం, శుద్ధజలం అందించాలన్నారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. రాబోయే పదోతరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏఎస్‌డబ్యూవోలు ధర్మానందగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, వార్డెన్ జయశంకర్ ఉన్నారు.