kumaram bheem asifabad- అరకొర వేతనం.. అవస్థలమయం
ABN , Publish Date - Oct 03 , 2026 | 10:56 PM
ఏళ్ల తరబడి పని చేస్తున్న ఫీల్డ్ అసిసెంట్లు అరకొర వేతనంతో అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీరాంజీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో పనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పారదర్శకతకు అధిక ప్రాఽధాన్యం ఇస్తూ గ్రామసభల్లో పనులు గుర్తిస్తున్నా రు.
- నియామకాలు లేక ఉన్నవారిపై పని భారం
- ఉద్యోగ భద్రత కోసం ఏళ్లుగా పోరాటం
- జిల్లాలో 160 మంది ఎఫ్‌ఏలు
చింతలమానేపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి పని చేస్తున్న ఫీల్డ్ అసిసెంట్లు అరకొర వేతనంతో అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీరాంజీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో పనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పారదర్శకతకు అధిక ప్రాఽధాన్యం ఇస్తూ గ్రామసభల్లో పనులు గుర్తిస్తున్నా రు. కానీ పనుల గర్తింపు, నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లు పని భారం, అరకొర జీతంతో కుదేలవుతున్నారు. కూలీలకు పనులు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. రెండు దశాబ్దాలుగా క్షేత్ర స్థాయిలో చెమటోడస్తున్నా ఉద్యో భద్రత లేక అవస్థలు పడుతున్నారు. ఓ వైపు ధరలు పెరుగు తున్నప్పటికీ వీరు మాత్రం కేవలం రూ.12వేల జీతంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అది కూడా నెలల తరబడి ఆలస్యంగా ఇస్తుండడంతో కుటుంబ పోషణ భారమవుతోంది. మరో వైపు క్షేత్ర స్థాయిలో పోస్టులు ఖాళీగా ఉన్న నియామకాలు చేపట్టక పోవడంతో ఒకరి పనులు మరొకరిపై పడి పని భారంతో నలిగి పోతున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం కేవలం 160 మంది(పాత పంచాయతీల వారీగా) మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వి హస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డు అసిస్టెంట్ అవసరం ఉన్నా నూతన నియమాకాలు చేపట్డడం లేదు. ఉన్న వారితోనే పనులు చేయిస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథ కం ప్రారంభం నుంచి ఇప్పుడు వీబీజీరామ్‌జీ పథకం వరకు దాదాపు 20 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసెస్టెంట్లకు నేటికి పదోన్నతలు లేవు. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఇతర ఖర్చులు పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు కేవలం రూ.12వేల వేతనం మాత్రమే చెల్లిస్తుండగా అవి కూడా సక్రమంగా అందడం లేదు. వేతనాలు మూడు, నాలుగు నెలలకు ఒక సారి విడుదల చేస్తున్నారు. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేస్తారని ఆశ పడ్డారు. కానీ వీరి ఆశలు నెరవేరలేదు. ఉద్యోగ భద్రత లేక అరకొర జీతంలో కాలం వెళ్లదీస్తున్నారు.
- సమాన పనికి..
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమను క్రమబద్ధీకరించి సమాన పనికి స మాన వేతనం అమలు చేయాలని వేడుకుంటున్నా రు. వీబీజీ రామ్ జీ పథకం క్షేత్ర స్థాయి అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. పనులను గుర్తించడం నుంచి మొదలుకొని కూలీలను సమీకరించడం వరకు బాధ్యత వీరిపైనే ఉంటుంది. వచ్చిన కూలీలకు సంబంధించిన మాస్టర్ రోల్ నిర్వహణతో పాటు చేపడుతున్న పని ప్రదేశాన్ని పరిశీలించడం వంటి ముఖ్యమైన పనులు చేపడుతారు. పని ప్రదేశంలో నీడ, తాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. పని కావాలని కోరుతున్న కూలీలకు సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళుతారు. కావల్సిన వారికి పని కల్పించడం, ఆ పనులకు సంబంధించిన వివిధ రకాల రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. అవే కాకుండా ఇతర అభివృద్ధి పనులు కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత చేస్తున్నా వీరికి ఉద్యోగ భధ్రత లేని పరిస్థితి నెలకొంది. ఇప్ప టికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి..
- రమేశ్, పీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెం ట్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. గతంలో అధి కారులకు, నాయకులకు వినతిపత్రాలు సమర్పించిన ప్పటికీ ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మా పెం డింగ్ సమస్యలు పరిష్కరించాలి. కొత్త గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఇంతవరకు ఎఫ్‌ఏలను నియమించలేదు. ఇన్‌చార్జిలతో ప్రస్తుతం కొనసా గించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పం దించి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలి.